స్పెయిన్‌ యువ సంచలనం పేరు వెనుక ఆసక్తికర కథ

Published on Sat, 07/18/2026 - 11:55

స్పెయిన్ యువ సంచలనం లమీన్ యమాల్ పేరు వెనుక ఓ భావోద్వేగ కథ ఉంది. ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసిస్తున్న ఈ యువ ఆటగాడి పూర్తి పేరు లమీన్ యమాల్ నస్రౌయి ఎబానా (Lamine Yamal Nasraoui Ebana).

స్పెయిన్ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరు నస్రౌయి, తల్లి ఇంటి పేరు ఎబానా. అయితే ఫుట్‌బాల్ ప్రపంచంలో అతను లమీన్ యమాల్ పేరుతోనే గుర్తింపు పొందాడు.

యమాల్ తండ్రి మౌనిర్ నస్రౌయి మొరాకోకు చెందినవాడు. తల్లి షీలా ఎబానా ఈక్వటోరియల్ గినియాలో జన్మించారు. యమాల్ పుట్టినప్పుడు ఇద్దరూ చాలా చిన్న వయసులో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల పేర్లు లమీన్ మరియు యమాల్. వారి సహాయానికి కృతజ్ఞతగా తమ కుమారుడికి 'లమీన్ యమాల్' అని పేరు పెట్టినట్లు స్పానిష్ మీడియా వెల్లడించింది. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. (Story Behind Lamine Yamal Name)

'లమీన్' అనే పేరు అరబిక్‌లో నమ్మకమైన వ్యక్తి, నిజాయితీ గలవాడు అనే అర్థం ఇస్తే, 'యమాల్' (జమాల్) అంటే అందం, సొగసు, ఆకర్షణ అనే అర్థాలు ఉన్నాయి.

2007లో జన్మించిన యమాల్, చిన్నతనంలోనే బార్సిలోనా లా మాసియా అకాడమీలో చేరి అసాధారణ ప్రతిభతో ప్రపంచ ఫుట్‌బాల్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు స్పెయిన్ జాతీయ జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగిన యమాల్, తన పేరులో దాగి ఉన్న ఈ భావోద్వేగ కథతో మరోసారి అభిమానులకు చేరువయ్యాడు.

ఇదిలా ఉంటే, జులై 19న  న్యూజెర్సీలోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్‌కప్‌ 2026 ఫైనల్లో అర్జెంటీనా-స్పెయిన్‌ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ మ్యాచ్‌ నేపథ్యంలో యమాల్‌, అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ మధ్య కొన్ని యాదృచ్ఛిక విషయాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వీరిద్దరికి 19 సంఖ్యతో ముడిపడిన అనుబంధం ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

2007లో యునిసెఫ్ నిర్వహించిన ఛారిటీ ఫోటోషూట్‌లో అప్పటి 20 ఏళ్ల మెస్సీ, ఆరు నెలల చిన్నారి యమాల్‌కు స్నానం చేయించాడు. అదే చిన్నారి ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీకి ప్రత్యర్థిగా నిలబడ్డాడు.

ఈ ఫోటోషూట్‌కు సరిగ్గా 19 ఏళ్ల తర్వాత జులై 19న జరిగే ప్రపంచకప్ ఫైనల్లో మెస్సీ-యమాల్‌ ఒకరినొకరు ఎదుర్కోనున్నారు.

ప్రపంచకప్‌ ఫైనల్‌కు కొద్ది రోజుల ముందే (జూలై 13) యమాల్ తన 19వ పుట్టినరోజు జరుపుకున్నాడు.

మెస్సీ, యమాల్‌ తమ మొదటి ప్రపంచకప్ గోల్‌ను 18 ఏళ్ల వయసులో, 19వ నంబర్‌ జెర్సీ ధరించి నమోదు చేయడం మరింత ఆశ్చర్యకరం.

 

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)