Breaking News

‘అదే కీలక మలుపు’

Published on Thu, 06/26/2025 - 02:30

లీడ్స్‌: తొలి టెస్టులో భారత జట్టు లోయర్‌ ఆర్డర్‌ను కట్టడి చేయడం కూడా తమ విజయానికి ప్రధాన కారణమని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై కూడా తమ బౌలర్లు ప్రత్యర్థి చివరి వరుస బ్యాటర్లను తొందరగా అవుట్‌ చేయడంలో సఫలమయ్యారని అతను ప్రశంసించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయిన భారత్‌... రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. 

‘ఇరు జట్లు నమోదు చేసిన స్కోర్లు చూస్తే మంచి బ్యాటింగ్‌ పిచ్‌ అని అర్థమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో పలు మలుపులున్నా అన్నింటికంటే ప్రధానమైన కారణం రెండుసార్లూ భారత్‌ లోయర్‌ ఆర్డర్‌ను మేం కట్టడి చేయడమే అని నేను భావిస్తున్నా. రెండో ఇన్నింగ్స్‌లో అయితే భారత్‌ స్కోరు కనీసం 500 వరకు చేరే అవకాశం కనిపించింది. అలా జరిగితే మాకు ఛేదన కష్టమయ్యేది. కానీ మా బౌలర్లు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి ఆటతో పాటు ప్రతీ సెషన్‌లో మా ఆటగాళ్లు చూపిన పట్టుదల కూడా ప్రశంసనీయార్హం’ అని స్టోక్స్‌ అన్నాడు. 

371 పరుగుల ఛేదనలో శుభారంభం అందించిన ఓపెనర్లు డకెట్, క్రాలీలను కెపె్టన్‌ ప్రత్యేకంగా అభినందించాడు. ముఖ్యంగా జడేజా బౌలింగ్‌లో డకెట్‌ రివర్స్‌ స్వీప్‌లతో భారీగా పరుగులు రాబట్టడం అద్భుతమని... అతని సలహాతోనే తాను కూడా స్పిన్‌ను ఎదుర్కొనేందుకు రివర్స్‌ స్వీప్‌ వైపే మొగ్గు చూపానని ఇంగ్లండ్‌ కెపె్టన్‌ చెప్పాడు. హెడింగ్లీ మైదానంలో సాధారణంగా అవుట్‌ఫీల్డ్‌ చాలా వేగంగా ఉంటుందని, అందుబాటులో ఉన్న ఓవర్లన్నీ ఆడగలిగితే తాము విజయం సాధిస్తామనే గట్టి నమ్మకంతో ఉన్నామన్న స్టోక్స్‌... టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ తీసుకున్న నిర్ణయం చివరకు తప్పు కాకపోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)