Breaking News

క్రికెట్‌లోమద్యపానం కొత్తేం కాదు!

Published on Wed, 08/05/2026 - 04:22

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ మద్యపానం అలవాటుతో పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్టు తర్వాత అర్ధరాత్రి పార్టీకి వెళ్లి నిబంధనలు ఉల్లంఘించడంతో రెండో టెస్టులో చోటు పోయింది. తర్వాతి టెస్టు ఆడినా అనూహ్యంగా ఆటకు గుడ్‌బై చెప్పేశాడు. అయితే క్రికెటర్లు మద్యపానం చేయడం కొత్తేమీ కాదని, ఈ అలవాటు ఇంగ్లండ్‌ ఆటగాళ్లకు మాత్రమే పరిమితం కాదని అతను అభిప్రాయ పడ్డాడు. ‘డ్రింకింగ్‌’ ఇంగ్లండ్‌ జట్టు పెద్ద సమస్యగా మారిందా అంటూ ఒక ఇంటర్వ్యూలో మరో మాజీ ప్లేయర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ అడిగిన ప్రశ్నకు స్టోక్స్‌ సమాధానమిచ్చాడు. 

‘క్రికెట్‌లో మద్యపాన సంస్కృతి చాలా కాలంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇదేమీ మారలేదు. 2026కు వచ్చే సరికి ఆటలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రొఫెషనలిజం పెరిగింది. అయితే ఆల్కహాల్‌లో క్రికెట్‌ అనుబంధం మాత్రం మారలేదు. ఆటతో ఇది ముడిపడిపోయింది. క్లబ్‌ క్రికెట్‌నుంచి పెద్ద స్థాయి వరకు ఇది సాగుతుంది. దీనిని ఇంగ్లండ్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయవద్దు. క్రికెట్‌లో ఆహారపు అలవాట్లు, న్యూట్రిషన్, వైద్య సహకారం, డైట్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఆటగాళ్ల సన్నద్ధతవంటివి ఎన్నో జాగ్రత్తలు ఉన్నా సరే...క్రికెటర్లు ఆల్కహాల్‌ తీసుకోవడం మానలేదు. అది సహజంగానే కొనసాగుతోంది’ అని స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)