Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే సూపర్‌ క్యాచ్‌.. వీడియో వైరల్‌

Published on Thu, 06/06/2024 - 22:00

టీ20 వరల్డ్‌కప్‌-2024లో భాగంగా డల్లాస్‌ వేదికగా పాకిస్తాన్‌-యూనైటడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు.

 30 పరుగులకే పాకిస్తాన్‌ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మహ్మద్‌ రిజ్వాన్‌(9), ఫఖార్‌ జమాన్‌(11), ఉస్మాన్‌ ఖాన్‌(3) వంటి స్టార్‌ బ్యాటర్లు ఎటువంటి ప్రభావం చూపకలేకపోయారు. నేత్రవల్కర్,నోస్తుష్ కేంజిగే, అలీ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

సూపర్‌ క్యాచ్‌..
ఇక ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు స్టీవెన్ టేలర్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ను టేలర్‌ పెవిలియన్‌కు పంపాడు. పాక్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన నేత్రవల్కర్‌ మూడో బంతిని రిజ్వాన్‌కు గుడ్‌ లెంగ్త్‌ డెలివరీగా సంధించాడు. 

దీంతో రిజ్వాన్‌ లెగ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి కాస్త లేట్‌గా స్వింగ్‌ కావడంతో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని ఫస్ట్‌ స్లిప్‌ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఫస్ల్‌ స్లిప్‌లో ఉన్న టేలర్‌ తన కుడివైపునకు డైవ్‌ చేస్తూ సింగిల్‌ హ్యాండ్‌తో సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

దీంతో రిజ్వాన్‌ మైండ్‌బ్లాంక్‌ అయిపోయింది. చేసేదేమి లేక రిజ్వాన్‌(9) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)