Breaking News

బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్‌ స్మిత్‌.. వీడియో వైరల్‌

Published on Sat, 06/10/2023 - 08:40

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తెలుగు సినిమాల్లోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. లండన్‌ వేదికగా భారత్‌తో జరగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో బీజీగా ఉన్న స్మిత్‌.. ఖాళీ సమయంలో స్టార్‌స్పోర్ట్స్‌-1 తెలుగుతో ముచ్చటించాడు. ఈ క్రమంలో యాంకర్‌ చెప్పిన డైలాగ్‌లను స్మిత్‌ తనదైన స్టైల్‌లో చెప్పి నవ్వులు పూయించాడు.

ముఖ్యంగా టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ డైలాగ్‌లను స్మిత్‌  తనదైన మేనరిజంతో చెప్పాడు. అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను “, ” డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ వంటి డైలాగ్‌లు స్మిత్‌ నోటి నుంచి వచ్చాయి.

అదే విధంగా చివరకు ” తగ్గేదేలే “.. అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్‌-1 ‍ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి  రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన పరుగులతో మొత్తంగా ఆసీస్‌ 296 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది.
చదవండి: WTC Final: టీమిండియా చేసిన తప్పు అదే.. అందుకే ఈ పరిస్థితి: ఆసీస్‌ దిగ్గజం

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)