ది హండ్రెడ్‌ లీగ్‌లో ఆడనున్న స్టీవ్‌ స్మిత్‌..

Published on Wed, 02/26/2025 - 12:27

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ 'ది హండ్రెడ్’ లీగ్‌లో ఆడ‌నున్నాడు. ది హండ్రెడ్ 2025 సీజ‌న్ కోసం వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ స్మిత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 12న జరగనున్న ది హండ్రెడ్ డ్రాఫ్ట్‌కు ముందుకు అన్ని ఫ్రాంచైజీలు త‌మ జ‌ట్ల‌ను ఖారారు చేసే పనిలో ప‌డ్డాయి. రూల్స్ ప్రకారం.. గత సీజన్‌లో తమతో ఉన్న 10 మంది సభ్యులను  ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకోవచ్చు.

ఈ లిస్ట్‌లో కచ్చితంగా ఒక​ ఇంగ్లండ్‌ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్‌ తప్పక ఉండాలి. అలాగే ముగ్గురు ఓవర్సీస్‌ ప్లేయర్లు​ ఉండవచ్చు. అదనంగా ఓ విదేశీ ఆటగాడిని డైరెక్ట్‌ సైనింగ్‌ చేసుకోవచ్చు. ఈ పద్దతిలోనే స్మిత్‌ను త‌మ జ‌ట్టులోకి వెల్ష్ పైర్ తీసుకుంది.  ఈ విష‌యాన్ని వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ్రువీక‌రించింది. అదేవిధంగా వెల్ష్ ఫైర్‌తో ఒప్పందంపై స్మిత్ కూడా స్పందించాడు.

"వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీలో చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది వేసవి తర్వాత నేను ది హండ్రెడ్‌లో భాగం కానున్నాను. తొలిసారి ఈ టోర్నీలో ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎటువంటి ఫార్మాట్‌లో ఆడడం మనకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. వరల్డ్ క్లాస్ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడుతున్నారు. 

మైక్ హస్సీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాను. వెల్ష్ ఫైర్ కోసం 100 శాతం ఎఫక్ట్ పెట్టేందుకు ప్రయత్నిస్తాను" స్మిత్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా ఈ ఫ్రాంచైజీ హెడ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మైక్ హస్సీ వ్యవహరిస్తున్నాడు. ఈ వంద బంతుల టోర్నీ ఆగ‌స్టు 5 నుంచి ప్రారంభం కానుంది.

ది హండ్రెడ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు..!
కాగా ఈ 'ది హండ్రెడ్’ లీగ్‌లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం భారీ మొత్తం ఇన్వెస్ట్ చేశాయి. ముంబై ఇండియ‌న్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌,స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజమాన్యాలు దాదాపు రూ.3,257 కోట్లను పెట్టుబడులుగా పెట్టాయి. ఢిల్లీ క్యాపిటల్స్ – సదరన్ బ్రేవ్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ – మాంచెస్టర్ ఒరిజినల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ – నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్లలో వాటాలు కొనుగోలు చేశాయి.
చదవండి: 'ఇంత చెత్త‌గా ఆడుతార‌ని ఊహించలేదు.. నన్ను క్ష‌మించండి'

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)