Breaking News

వరల్డ్‌కప్‌ జట్టులోకి స్టీవ్‌ స్మిత్‌

Published on Wed, 02/11/2026 - 15:04

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌ 2026 జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 11) జరుగనున్న మ్యాచ్‌కు ముందు రెగ్యులర్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడటంతో స్టీవ్‌ను హుటాహుటిన శ్రీలంకకు పిలిపించారు. స్టీవ్‌కు తొలుత ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు.

బిగ్‌బాష్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నా, స్టీవ్‌ను ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందు నుంచే విమర్శలు ఉన్నాయి. మార్ష్ అనూహ్యంగా గాయపడటంతో స్టీవ్‌కు అవకాశం లభించింది. స్టీవ్‌ ఫిబ్రవరి 13న జింబాబ్వేతో మ్యాచ్‌ సమయానికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తుంది.

కాగా, ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సమయంలో మిచెల్‌ మార్ష్‌ గాయపడ్డాడు. తద్వారా అతను ఐర్లాండ్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ట్రవిస్‌ హెడ్‌ ఆసీస్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ప్రాక్టీస్ సమయంలో బంతి తగిలి మార్ష్‌కు టెస్టిక్యులర్ బ్లీడింగ్ సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటన ప్రకారం.. మార్ష్‌కు విశ్రాంతి అవసరం. వైద్యుల సూచనల ఆధారంగా తిరిగి ఆడే సమయం నిర్ణయించబడుతుంది. ఈ గాయం వల్ల ఆయన కదలికలు పరిమితం కావడంతో తక్షణమే జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

ఆసీస్‌ వేధిస్తున్న గాయాలు
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆసీస్‌ ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి సీనియర్ బౌలర్ల సేవలను కోల్పోయింది. ఇప్పుడు కెప్టెన్ మార్ష్ కూడా గాయపడటంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. అయితే అనుభవజ్ఞుడైన స్టీవ్‌ స్మిత్ చేరిక, బ్యాటింగ్ లైనప్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.

ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో ఆసీస్‌ షెడ్యూల్  
- ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ – ఫిబ్రవరి 11  
- జింబాబ్వేతో – ఫిబ్రవరి 13  
- శ్రీలంకతో – ఫిబ్రవరి 16  
- ఒమాన్‌తో – ఫిబ్రవరి 20  

ఇదిలా ఉంటే, కొలొంబో వేదికగా ఐర్లాండ్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

తుది జట్లు.. 
ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), కర్టిస్ కాంఫర్, బెంజమిన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, మాథ్యూ హంఫ్రీస్

ఆస్ట్రేలియా : ట్రావిస్ హెడ్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, మాట్ రెన్షా, కూపర్ కోనోలీ, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, ఆడమ్ జంపా 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)