Breaking News

AUS Vs WI: ఆస్ట్రేలియా తుది జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. స్టార్ ప్లేయ‌ర్ వ‌చ్చేశాడు

Published on Thu, 07/03/2025 - 09:04

గ్రెనడా వేదిక‌గా వెస్టిండీస్‌తో రెండో టెస్టులో త‌ల‌ప‌డేందుకు ఆస్ట్రేలియా సిద్ద‌మైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాల‌ని కంగారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్‌మెనెజ్‌మెంట్ త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్ ప్ర‌క‌టించింది.

చేతివేలి గాయం కార‌ణంగా తొలి టెస్టుకు దూర‌మైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెన‌డా టెస్టుకు అందుబాటులోకి వ‌చ్చాడు. స్మిత్ రాక‌తో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ జోష్ ఇంగ్లిష్‌పై వేటు ప‌డింది. తొలి టెస్టులో అవకాశం ల‌భించిన‌ప్ప‌టికి ఇంగ్లిష్ ఉప‌యోగించుకోలేకపోయాడు.

అదేవిధంగా బార్బ‌డోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల‌లో విఫ‌ల‌మైన సామ్ కాన్‌స్టాస్‌, ఆల్‌రౌండ‌ర్ కామెరూన్ గ్రీన్‌ల‌కు ఆసీస్ టీమ్‌మెనెజ్‌మెంట్ మ‌రో అవ‌కాశం క‌ల్పించింది.  ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్‌వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్‌లైన్ పేస‌ర్ల‌గా ఉన్నారు.

వీరితో పాటు నాలుగో పేస‌ర్‌గా ఆల్‌రౌండ‌ర్ బ్యూ వెబ్‌స్టర్  బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 ప‌రుగుల తేడాతో విండీస్‌ను క‌మ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.

విండీస్‌తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జ‌ట్టు
ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్‌, కామెరాన్ గ్రీన్‌, స్టీవ్ స్మిత్‌, ట్రావిస్ హెడ్‌, బ్యూ వెబ్‌స్ట‌ర్‌, అలెక్స్ క్యారీ, పాట్ క‌మ్మిన్స్‌, మిచెల్ స్టార్క్‌, నాథ‌న్ లియోన్‌, జోష్ హాజిల్‌వుడ్‌
చదవండి: #Shubman Gill: చ‌రిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్‌.. తొలి భారత ప్లేయర్‌గా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)