Breaking News

ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఆసీస్ దిగ్గ‌జం!

Published on Wed, 08/05/2026 - 17:46

ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు మైక్ హ‌స్సీ ఎంపిక‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌లే ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ప్లెమింగ్ ఇదే విష‌య‌మై మైక్ హ‌స్సీని సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. మైక్ హ‌స్సీ కూడా ప్లెమింగ్ ప్ర‌తిపాద‌న‌పై సానుకూల స్పంద‌నే వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. 

అయితే ఈ విష‌యంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ప్ర‌స్తుతం మైక్ హ‌స్సీ హండ్రెడ్ కాంపిటీష‌న్‌లో వెల్ష్ ఫైర్ జ‌ట్టుకు కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక గ‌తంలో ప్లెమింగ్‌, మైక్ హ‌స్సీ క‌లిసి 15 ఏళ్ల పాటు చెన్నై సూప‌ర్‌కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో క‌లిసి పని చేశారు. 

చాలాకాలం పాటు సీఎస్‌కేకు ప్రాతినిధ్యం వ‌హించిన మైక్ హ‌స్సీ ఆ త‌ర్వాత సీఎస్‌కేకు మెంటార్‌గా వ్య‌హ‌రించాడు. ఈ స‌మ‌యంలో స్టీఫెన్ ప్లెమింగ్ హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. 15 ఏళ్ల బంధమే ఇవాళ ప్లెమింగ్‌ను ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ ప‌ద‌వికి మైక్ హ‌స్సీ పేరును ప్ర‌తిపాదించేలా చేసింద‌ని చెప్పొచ్చు.

ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓట‌మి అనంత‌రం బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ టెస్టు కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానంలో స్టీఫెన్ ప్లెమింగ్‌ను రెడ్‌బాల్ క్రికెట్ కోచ్ ప‌ద‌వికి ఎంపిక చేసింది. ఇక స్టీఫెన్ ప్లెమింగ్ సీఎస్‌కే జ‌ట్టు కోచ్ ప‌ద‌వికి రాజీనామా  చేసి 18 ఏళ్ల బంధానికి స్వ‌స్తి ప‌లికాడు. 

ప్ర‌స్తుతం సొంత‌గ‌డ్డ‌పై ఇంగ్లండ్ జ‌ట్టు పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడ‌నుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగ‌స్టు 19 నుంచి 23 వ‌ర‌కు లీడ్స్ వేదికగా జ‌ర‌గ‌నుంది. ఆగ‌స్టు 27 నుంచి 31 వ‌ర‌కు రెండో టెస్టు, సెప్టెంబ‌ర్ 9 నుంచి 13 వ‌ర‌కు మూడో టెస్టు మ్యాచ్ ఆడ‌నుంది.

ఆస్ట్రేలియా త‌ర‌ఫున 2004లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మైక్ హ‌స్సీ ఆ జ‌ట్టు త‌ర‌ఫున బెస్ట్ బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. ఆస్ట్రేలియా త‌ర‌ఫున హ‌స్సీ 79 టెస్టుల్లో 6,235 ప‌రుగులు, 185 వ‌న్డేల్లో 5,442 ప‌రుగులు, 38 టీ20ల్లో 721 ప‌రుగులు సాధించాడు. త‌న కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు క‌లిపి 22 సెంచ‌రీలు సాధించాడు. ఇక ఐపీఎల్‌లో 59 మ్యాచ్‌లు ఆడిన మైక్ హ‌స్సీ 1,977 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచ‌రీ ఉండ‌డం విశేషం.

Read: ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డుపై నిషేధం?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)