Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీకి శ్రీలంక జట్టు ప్రకటన

Published on Sun, 02/01/2026 - 14:50

టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ దసున్ షనక సారథ్యం వహించనున్నాడు. లంక వరల్డ్‌కప్ జట్టులో పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, వానిందు హసరంగ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.

అదేవిధంగా యువ పేసర్ ఈషాన్ మలింగకు కూడా జట్టులో చోటు దక్కింది. దుష్మంత చమీర, మతీష పతిరణ, ప్రమోద్ మదుషన్‌లతో కలిసి మలింగ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో సత్తాచాటిన యువ బ్యాటర్ పవన్ రత్నాయకేకు కూడా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఇక  స్పిన్ విభాగంలో హసరంగ, తీక్షణ, వెల్లలాగే వంటి ఉన్నారు. సొంతగడ్డపై మ్యాచ్‌లు జరగనుండడంతో ఈ స్పిన్ త్రయం శ్రీలంకకు కీలకం కానుంది.

అసలంకపై వేటు..
కాగా ఈ మెగా టోర్నీ కోసం లం‍క సెలెక్టర్లు  గత డిసెంబర్‌లో 25 మం‍ది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చరిత్ అసలంకను సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో అనుభవజ్ఞుడైన దాసున్ శనకను తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

షనక కెప్టెన్‌గా గతంలో లంకకు ఆసియాకప్‌ను అందించారు. ఇప్పుడు మరోసారి తన అనుభవంతో జట్టును నడిపించేందుకు సిద్దమయ్యాడు. ఈ మెగా టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 8న కొలంబో వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. లంకేయులు ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతున్నారు.

టీ20 ప్రపంచకప్ కోసం శ్రీలంక జట్టు
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కుశాల్ పెరీరా, చరిత్ అసలంక, కమిల్ మిషార, పవన్ రత్నాయకే, జనిత్ లియానగే, దసున్ షనక (కెప్టెన్‌), కమిందు మెండిస్, దుష్మంత చమీర, మతీషా పతిరణ, ఎషాన్ మలింగ, వణిందు హసరంగా, మహేశ్ వెల్లలగే, మహేష్‌ తీక్షణ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)