Breaking News

Car Accident: టీ20 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ క్రికెటర్‌కు గాయాలు

Published on Thu, 03/14/2024 - 14:34

శ్రీలంక మాజీ క్రికెటర్‌ లాహిరు తిరిమన్నె, అతడి కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనురాధపుర  సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 

గురువారం జరిగిన ఈ ప్రమాదంలో తిరిమన్నెతో పాటు అతడి ఫ్యామిలీ కూడా గాయపడినట్లు న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ వెల్లడించింది. ప్రస్తుతం వీరంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన లెఫ్టాండర్‌ బ్యాటర్‌ తిరిమన్నె లంక తరఫున 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఆయా ఫార్మాట్లలో వరుసగా 2088, 3164, 291 పరుగులు చేశాడు. కెరీర్‌లో మొత్తంగా మూడు టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్లలో పాల్గొన్న లాహిరు తిరిమన్నె.. 2014లో టైటిల్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడు కూడా! అదే విధంగా ఐదు వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించిన అనుభవం అతడికి ఉంది. రెండు వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లోనూ భాగమయ్యాడు.

ఇక గతేడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన లాహిరు తిరిమన్నె ప్రస్తుతం లీగ్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ 2024 ఈవెంట్లో భాగమైన అతడు.. న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

ఈ క్రమంలో బుధవారం క్యాండీ స్యాంప్‌ ఆర్మీతో జరిగిన మ్యాచ్‌లోనూ లాహిరు తిరిమన్నె ఆడాడు. 14 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే, మ్యాచ్‌ అనంతరం కుటుంబానికి సమయం కేటాయించిన తిరిమన్నె గుడికి వెళ్లే క్రమంలో కారు ప్రమాదానికి గురయ్యాడు. లారీని ఢీకొన్న ఘటనలో అతడి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే, అదృష్టవశాత్తూ లాహిరు తిరిమన్నెతో పాటు అతడి కుటుంబం కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)