Breaking News

బాబోయ్‌... మేమెళ్లిపోతాం!

Published on Thu, 11/13/2025 - 03:55

కొలంబో: ప్రస్తుతం పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్‌ జట్టును తాజా ఇస్లామాబాద్‌ ఆత్మాహుతి దాడి ఘటన కంటిమీద కునుకు  లేకుండా చేస్తోంది. మంగళవారం జరిగిన ఈ హేయమైన ఉగ్రదాడిలో 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఈ దాడి లంక జట్టులో భయాందోళనలు పెంచింది. ఏకంగా 8 మంది ఆటగాళ్లు తిరుగుముఖం పట్టాలని నిర్ణయించుకున్నారు. 

షెడ్యూల్‌ ప్రకారం మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌ గురువారం రావల్పిండిలో జరగాల్సి ఉంది. సింహళ క్రికెటర్లు స్వదేశానికి పయనమైతే నేటి వన్డే మ్యాచ్‌ రద్దయ్యే అవకాశాలున్నాయి. తొలి వన్డే నెగ్గిన పాక్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఇది మగిశాక జింబాబ్వే మూడో జట్టుగా పాల్గొనే ముక్కోణపు టి20 సిరీస్‌లోనూ లంక తలపడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరుదాకా బిక్కుబిక్కుమంటూ పాక్‌లో ఉండలేమని లంక క్రికెటర్లు పేర్కొంటున్నారు. 

అయితే లంక బోర్డు (ఎస్‌ఎల్‌సీ) మాత్రం షెడ్యూల్‌ ప్రకారమే తమ జట్టు పాక్‌ పర్యటనను ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అవసరమైతే 8 మంది క్రికెటర్లను రిజర్వ్‌ బెంచ్‌తోనైనా భర్తీ చేసేందుకు సిద్ధమని లంక బోర్డు సూచనప్రాయంగా పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు  అభయమిచ్చినట్లు తెలిసింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం పాక్‌ పర్యటనకు వెళ్లిన లంక బృందంపై పాక్‌ ఉగ్రమూక దాడిచేసింది. ఈ ఘటనలో పలువురు లంక క్రికెటర్లు తూటా గాయాలకు గురయ్యారు.  
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)