Breaking News

న్యూజిలాండ్‌కు షాకిచ్చిన శ్రీలంక

Published on Fri, 03/14/2025 - 15:38

పరిమత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల జట్టు తొలి విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ (మార్చి 14) జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 18.5 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్లు మల్కి మదారా 3, కవిష దిల్హరి, ఇనోషి ప్రియదర్శిని తలో 2, సుగంధిక కుమారి, చమారీ ఆటపట్టు చెరో వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో ఎమ్మా మెక్‌లియోడ్‌ (44), కెప్టెన్‌ సూజీ బేట్స్‌ (21), జెస్‌ కెర్‌ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జార్జియా ప్లిమ్మర్‌ 2, బ్రూక్‌ హ్యాలిడే 4, ఇజ్జి షార్ప్ 0, మ్యాడీ గ్రీన్‌ 5, పోల్లి ఇంగ్లిస్‌ 4, రోస్‌మేరీ మైర్‌ 0, ఎడెన్‌ కార్సన్‌ 7 పరుగులు చేశారు. లంక బౌలర్లు చెలరేగడంతో న్యూజిలాండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

అనంతరం ఓపెనర్‌ చమారీ ఆటపట్టు (48 బంతుల్లో 64 నాటౌట్‌) అజేయ అర్ద సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నిలాక్షి డిసిల్వతో (12 నాటౌట్‌) కలిసి ఆటపట్టు లంకను విజయతీరాలకు చేర్చింది. లంక ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్‌ 7, హర్షిత సమరవిక్రమ 2, కవిశ దిల్హరి 12 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో జెస్‌ కెర్‌ 2 వికెట్లు పడగొట్టింది. 

ఈ గెలుపుతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ముందుగా వన్డే సిరీస్‌ ఆడింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ జయకేతనం ఎగురవేసింది. రెండో టీ20 క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా మార్చి 16న జరుగనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)