Breaking News

విధ్వంసం సృష్టించిన అసలంక.. రెచ్చిపోయిన కుశాల్‌, సమరవిక్రమ

Published on Mon, 03/04/2024 - 19:27

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టు భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి బంగ్లాదేశ్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ చరిత్‌ అసలంక (21 బంతుల్లో 44 నాటౌట్‌; 6 సిక్సర్లు) అర డజను సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా.. కుశాల్‌ మెండిస్‌ (36 బంతుల్లో 59; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సదీర సమరవిక్రమ (48 బంతుల్లో 61 నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. లంక ఇన్నింగ్స్‌లో అవిష్క ఫెర్నాండో (4), కమిందు మెండిస్‌ (19) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో షోరీఫుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌, రిషద్‌ హొసేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌, ఆతర్వాత వన్డేలు, టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)