Breaking News

శ్రీలంకలో ఆసియాకప్‌.. జరుగుతుందా? లేదా?

Published on Wed, 05/31/2023 - 08:58

ఆసియాకప్‌ 2023 నిర్వహణపై ఇంకా సందిగ్థత వీడడం లేదు. వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ జరగాల్సి ఉంది. ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ తర్వాత ఆసియా కప్‌ నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకుంటామని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఐపీఎల్‌ ఫైనల్‌ అనంతరం నిర్వహించిన మీటింగ్‌లో ఆసియాకప్‌ వేదికను పాకిస్తాన్‌ నుంచి శ్రీలంకకు మార్చినట్లు వార్తలు వస్తున్నాయి.

పాకిస్తాన్‌లో ఆసియా కప్‌ ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో పీసీబీ హైబ్రిడ్‌ మోడ్‌లో ఆసియా కప్‌ నిర్వహించేందుకు ప్రణాళిక పంపింది. అయితే ఈ  ప్రపోజల్‌ను మీటింగ్‌లో శ్రీలంక సహా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డులు తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా కప్‌ను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఏసీసీకి తెలిపింది. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో ఆసియాకప్‌ శ్రీలంకలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇది జరిగితే మాత్రం ఆసియా కప్‌లో పాక్‌ ఆడేందుకు నిరాకరించే అవకాశం ఉంది. అంతేకాదు ఆసియా కప్‌ నిర్వహణకు అడ్డుపడుతూ తమవద్ద నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నందుకు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.దీంతో ఆసియా కప్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ బుధవారం మరొకసారి సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో చర్చించి ఆసియా కప్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదన హైబ్రిడ్ మోడల్ రెండు రకాలు ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ఏంటంటే ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించబడుతుంది.. అయితే భారత జట్టు తటస్థ వేదికలో వారితో ఆడవచ్చు. ఇక రెండవ ప్రతిపాదన ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా... ఈ రౌండ్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. నిజానికి రెండో రౌండ్‌లో వారితో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది.

చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా!

Videos

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)