Breaking News

42 ప‌రుగుల‌కే ఆలౌట్‌.. శ్రీలంక చెత్త రికార్డు! ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా

Published on Thu, 11/28/2024 - 18:27

డ‌ర్బ‌న్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. శ్రీలంక త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 42 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల దాటికి లంకేయులు వ‌ణికిపోయారు.

వ‌చ్చిన‌వారు వ‌చ్చిన‌ట్టుగానే పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. లంక బ్యాట‌ర్ల‌లో క‌మిందు మెండిస్(13), ల‌హురు కుమారా(10) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 7 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కోయిట్జీ రెండు, రబాడ ఒక్క వికెట్ సాధించారు.

కాగా అంతకుముందు 80/4 ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా  తమ మొదటి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ప్రోటీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ టెంబా బావుమా(70) హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికా 77 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

శ్రీలంక చెత్త రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో 42 ప‌రుగుల‌కే ఆలౌటైన‌ శ్రీలంక ఓ చెత్త రికార్డు మూట‌కట్టుకుంది. ద‌క్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్య‌ల్ప టోట‌ల్‌ను జ‌ట్టుగా శ్రీలంక నిలిచింది. ఇంత‌కుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2013లో కేప్‌టౌన్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో 45 ప‌రుగుల‌కే కివీస్ ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక‌కు ఇదే టెస్టుల్లో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.
చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్‌.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్‌ బుమ్రా

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)