Breaking News

SL Vs WI: మెండిస్‌, పెరీరా విధ్వంసం.. మూడో టీ20లో విండీస్ చిత్తు

Published on Fri, 10/18/2024 - 09:04

దంబుల్లా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2–1తో లంక సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 

కెప్టెన్ రావ్‌మన్ పావెల్‌(27 బంతుల్లో 37; ఒక ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుడకేశ్‌ మోతీ (15 బంతుల్లో 32; ఒక ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో మహీశ్‌ తీక్షణ, హసరంగ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అదరగొట్టిన మెండీస్‌, పెరీరా..
అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేసింది.  వికెట్‌ కీపర్‌ కుశాల్‌ మెండిస్‌ (50 బంతుల్లో 68 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కుశాల్‌ పెరీరా (36 బంతుల్లో 55 నాటౌట్‌; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకాలతో చెలరేగారు. వీరిద్దరితో నిసాంక (22 బంతుల్లో 39; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) కూడా మెరుపులు మెరిపించాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ఆక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి:IND Vs NZ ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)