Breaking News

రెచ్చిపోయిన లంక బ్యాటర్లు.. విండీస్‌ ఖాతాలో మరో పరాజయం

Published on Mon, 10/21/2024 - 15:31

శ్రీలంక పర్యటనలో వెస్టిండీస్‌ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. పల్లెకెలె వేదికగా నిన్న (అక్టోబర్‌ 20) జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు​ చేసింది. వర్షం అంతరాయల నడము సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా శ్రీలంక 2-1 తేడాతో గెలుచుకుంది.

నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 38.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన లంక లక్ష్యాన్ని 37 ఓవర్లలో 232 పరుగులుగా నిర్దారించారు. విండీస్‌ ఇన్నింగ్స్‌లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ 74 (నాటౌట్‌), రోస్టన్‌ ఛేజ్‌ 33 (నాటౌట్‌), కీసీ కార్తీ 37 పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ 2, వాండర్సే, అసలంక తలో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో శ్రీలంక 31.5 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బ్యాటర్లు నిషన్‌ మధుష్క (69), చరిత్‌ అసలంక (77) రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. ఆఖర్లో కమిందు మెండిస్‌ (30 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీ 3, అల్జరీ జోసఫ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక ఘనంగా బోణీ కొట్టింది. రెండో వన్డే అక్టోబర్‌ 23 పల్లెకెలె వేదికగానే జరుగనుంది. 

చదవండి: చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)