Breaking News

డిసిల్వ, మెండిస్‌ 'ద్వి'శతక హోరు.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

Published on Mon, 03/25/2024 - 14:27

రెండు మ్యాచ్‌ల టెస్ట​ సిరీస్‌లో భాగంగా సిల్హెట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక 328 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ధనంజయ డిసిల్వ (102, 108), కమిందు మెండిస్‌ (102, 164) రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాది శ్రీలంకను గెలిపించారు. వీరికి బౌలర్లు కసున్‌ రజిత (3/31, 5/56), విశ్వ ఫెర్నాండో (4/48, 3/36), లహిరు కుమార (3/31, 2/39) తోడవ్వడంతో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ధనంజయ డిసిల్వ, కమిందు మెండిస్‌ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ఖలీద్‌ అహ్మద్‌, నహిద్‌ రాణా తలో 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్‌ ఇస్లాం, తైజుల్‌ ఇస్లాం చెరో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం లంక బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్‌ ఇస్లాం (47) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 92 పరుగుల ఆధిక్యంతో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక.. డిసిల్వ, మెండిస్‌ మరోసారి శతక్కొట్టడంతో 418 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్‌ మీరజ్‌ 4, నహిద్‌ రాణా, తైజుల్‌ ఇస్లాం చెరో 2, షోరీఫుల్‌ ఇస్లాం, ఖలీద్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ పేలవ ప్రదర్శనను పునరావృతం చేసి 182 పరుగులకే చాపచుట్టేసింది. తద్వారా శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బంగ్లా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మొమినుల్‌ హక్‌ (87 నాటౌట్‌) చివరి వరకు ఒంటి పోరాటం చేశాడు. రెండో టెస్ట్‌ మార్చి 39 నుంచి ప్రారంభంకానుంది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు