Breaking News

యువతి పట్ల మృగంలా వ్యవహరించిన కేసు.. క్రికెటర్‌కు ఊరట

Published on Thu, 05/18/2023 - 14:08

లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్‌ ధనుష్క గుణతిలకకు ఊరట లభించింది. గుణతిలకపై నమోదైన నాలుగు కేసుల్లో మూడింటిని డౌనింగ్ సెంటర్ లోకల్ కోర్ట్‌ (సిడ్నీ) కొట్టివేసింది. గుణతిలకపై మరో కేసు విచారణలో ఉన్నట్లు కోర్టు పేర్కొంది. 

విచారణలో ఉన్న కేసు ఏంటంటే..
బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడే క్రమంలో మృగంలా ప్రవర్తించాడని, పలు మార్లు రక్షణ కూడా లేకుండా బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడన్న కేసులో గుణతిలక ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నాడు. పోలీసుల ఫ్యాక్ట్స్ షీట్ ప్రకారం.. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో గుణతిలక బాధితురాలి పట్ల పైశాచికంగా వ్యవహరించాడని, ఆమె తిరగబడే సరికి సహనం కోల్పోయిన అతను.. గొంతు నులిమి, ఊపిరి ఆడనీయకుండా చేశాడని, అలాగే తలను గోడకేసి పలు మార్లు గట్టిగా బాదాడని తెలుస్తోంది.

దోషిగా తేలితే 14 ఏళ్ల జైలు శిక్ష..
ఈ కేసులో దోషిగా తేలితే గుణతిలకకు 14 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశముంది. మరోవైపు గుణతిలకపై ఇదివరకే శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సస్పెన్షన్‌ వేటు వేసింది. ఏ రకమైన క్రికెట్‌ (స్థాయి, ఫార్మాట్, లీగ్‌) ఆడకుండా ఎస్‌ఎల్‌సీ నిషేధం విధించింది.

కాగా, గతేడాది టీ20 వరల్డ్‌కప్‌-2022 ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన గుణతిలక.. సిడ్నీలో ఓ యువతిపై బలవతంగా అత్యాచారిని పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టైన గుణతిలక బెయిల్‌ కూడా దొరక్క నానా ఇబ్బందుల పడ్డాడు.

చదవండి: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్.. కేసు నమోదు! ఎందుకంటే?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)