శ్రీలంక మాస్టర్‌ మైండ్‌.. వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కోచ్‌తో ఒప్పందం

Published on Thu, 01/08/2026 - 18:03

టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు బ్యాటిం‍గ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ విక్రమ్ రాథోర్‌ను ఎస్‌ఎల్‌సీ నియమించింది.  టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీకి శ్రీలంక జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు విక్రమ్ రాథోర్‌ను కన్సల్టెన్సీ ప్రాతిపదికన బ్యాటింగ్ కోచ్‌గా నియ‌మించాము అని లంక క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

రాథోర్‌ జ‌న‌వ‌రి 18న లంక‌తో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. ప్రపంచ కప్ ముగిసే వరకు జ‌ట్టుతోనే ఉండ‌నున్నాడు. విక్ర‌మ్‌కు కోచ్‌గా అపార‌మైన అనుభ‌వం ఉంది. . 2019 సెప్టెంబ‌ర్ నుంచి 2024 జూలై వ‌ర‌కు భార‌త బ్యాటింగ్ కోచ్‌గా చేశారు. భారత్ 2024 టీ20 ప్రపంచ కప్ గెలవడంలోఅత‌డు కీలక పాత్ర పోషించాడు. బీసీసీఐ లెవ‌ల్ 3 కోచ్‌గా కొన‌సాగాడు.

అత‌డు ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా కూడా ప‌నిచేస్తున్నాడు. కాగా శ్రీలంక ఇప్ప‌టికే భార‌త మాజీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్ రామకృష్ణన్ శ్రీధర్‌ను త‌మ ఫీల్డింగ్ కోచ్‌గా నియ‌మించింది. రాథోర్ భార‌త బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న స‌మ‌యంలోనే ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధ‌ర్ పనిచేశాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రపంచ కప్ లక్ష్యంగా భారత కోచింగ్ అనుభవాన్ని ఉపయోంచుకుంటుంది. అదేవిధంగా లెజెండరీ బౌలర్ లసిత్ మలింగ కూడా ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా సేవ‌లందించ‌నున్నాడు. కాగా ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌కు శ్రీలంక‌, భార‌త్ సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. శ్రీలంక త‌మ లీగ్ మ్యాచ్‌ల‌న్నింట‌ని స్వ‌దేశంలోనే ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)