Breaking News

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ప్రకటన

Published on Wed, 12/18/2024 - 18:45

న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (డిసెంబర్‌ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్‌ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్‌ కోసం శ్రీలంక స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దునిత్‌ వెల్లలగేను విడిచిపెట్టింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో తలపడిన లంక జట్టులో ఇది ఏకైక మార్పు.

ప్రస్తుతం ప్రకటించిన లంక జట్టు పేస్‌ మరియు స్పిన్‌ బౌలర్లతో సమతూకంగా ఉంది. గత న్యూజిలాండ్‌ సిరీస్‌లో అరంగేట్రం చేసిన సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ చమిందు విక్రమసింఘే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రముఖ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ  స్పిన్‌ విభాగాన్ని లీడ్‌ చేయనున్నాడు. హసరంగ స్పిన్‌ టీమ్‌లో మహీశ్‌ తీక్షణ, లెగ్‌ స్పిన్నర్‌ జెఫ్రీ వాండడ్సే ఉన్నారు.

లంక పేస్‌ విభాగాన్ని అశిత ఫెర్నాండో లీడ్‌ చేయనున్నాడు. నువాన్‌ తుషార, మతీష పతిరణ, లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ బినుర ఫెర్నాండో పేస్‌ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్‌ విషయానికొస్తే.. కెప్టెన్‌ అసలంక​, నిస్సంక, కుసల్‌ పెరీరా, కుసల్‌ మెండిస్‌, చండీమాల్‌, కమిందు మెండిస్‌, భానుక రాజపక్సతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.

కాగా, న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి టీ20 డిసెంబర్‌ 28న జరుగనుంది. మౌంట్‌ మాంగనూయ్‌లోని బే ఓవల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం డిసెంబర్‌ 30వ తేదీ రెండో టీ20 జరుగనుంది. తొలి టీ20 జరిగిన చోటే ఈ మ్యాచ్‌ కూడా జరుగనుంది. వచ్చే ఏడాది జనవరి 2న మూడో టీ20 జరుగనుంది. నెల్సన్‌లోని సాక్స్టన్‌ ఓవల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. టీ20 సిరీస్‌ అనంతరం జనవరి 5, 8, 11 తేదీల్లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది.

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు..
చరిత్ అసలంక (కెప్టెన్‌), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరణ, జెఫ్రీ వాండర్సే, నువాన్ తుషార, అశిత ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)