Breaking News

పోరాడిన కమిందు మెండిస్‌.. అయినా బంగ్లాదేశ్‌కే స్వల్ప ఆధిక్యం

Published on Fri, 06/20/2025 - 13:52

గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక అద్బుతమైన పోరాటం కనబర్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 495 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. శ్రీలంక కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 485 పరుగులకు ఆలౌటై, బంగ్లాదేశ్‌కు 10 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని ఇచ్చింది.

368/4 స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో 107 పరుగులు చేసి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ కమిందు మెండిస్‌ (87) అద్బుతమైన పోరాటం చేసి తన జట్టును బంగ్లాదేశ్‌ స్కోర్‌కు దగ్గరగా తీసుకెళ్లాడు. ఇవాళ ఆటలో కమిందు రత్నాయకేతో (39) అద్బుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కమిందు ఔటయ్యాక చివరి వరుస బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌ను అధిగమించలేకపోయింది.

అంతకుముందు పథుమ్‌ నిస్సంక (187) భారీ సెంచరీతో చెలరేగడంతో లంక ఇన్నింగ్స్‌ను బలమైన పునాది పడింది. నిస్సంక చండీమల్‌ (54) సాయంతో లంక ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దాడు. ఇతర బ్యాటర్లలో లహీరు ఉడార 29, ఏంజెలో మాథ్యూస్‌ 39, ధనంజయ డిసిల్వ 19, కుసాల్‌ మెండిస్‌ 5, తిరుండ రత్నాయకే 0, అశిత ఫెర్నాండో 4 పరుగులకు ఔటయ్యారు. ప్రభాత్‌ జయసూర్య 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో నయీమ్‌ హసన్‌ 5 వికెట్లు పడగొట్టగా.. హసన్‌ మహమూద్‌ 3, తైజుల్‌ ఇస్లాం, మొమినుల్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 495 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (350 బంతుల్లో 163; 9 ఫోర్లు), కెప్టెన్ న‌జ్ముల్ హుస్సేన్ షాంటో(279 బంతుల్లో 148; 15 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. వీరిద్ద‌రితో పాటు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ లిటన్‌ దాస్‌ (123 బంతుల్లో 90; 11 ఫోర్లు, 1 సిక్స్‌) కీల‌క ఇన్నింగ్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మిలన్‌ రత్నాయకే, తరిందు రత్నాయకే తలో 3 వికెట్లు సాధించారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)