Breaking News

ఆసియా కప్‌ జట్టును మరింత బలోపేతం చేసుకున్న శ్రీలంక

Published on Wed, 09/10/2025 - 11:56

శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఆసియా కప్‌ ఆడబోతున్న తమ జట్టును మరింత బలోపేతం చేసుకుంది. ఇదివరకే 17 మంది సభ్యుల జట్టును ప్రకటించిన ఆ బోర్డు.. తాజాగా మరో ఆటగాడిని యాడ్‌ చేసి బృంద సంఖ్యను 18కి పెంచుకుంది. కొత్తగా మిడిలార్డర్‌ బ్యాటర్‌, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జనిత్‌ లియనాగేను జట్టులో చేర్చుకుంది. 

లియనాగే మూడేళ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించినందుకు (70, 19) లియనాగేకు లేటుగా ఆసియా కప్‌ బెర్త్‌ దక్కింది. లియనాగే చివరిగా 2022 ఫిబ్రవరిలో భారత్‌తో తన చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. 

కెరీర్‌లో 29 వన్డేలు, 3 టీ20లు ఆడిన లియనాగే సెంచరీ, 6 అర్ద సెంచరీల సాయంతో 852 పరుగులు చేశాడు. అలాగే 3 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో లియనాగే.. దసున్‌ షనక, చమిక కరుణరత్నేతో కలిసి లంక బ్యాటింగ్‌ లోతును పెంచనున్నాడు.

జట్టులో చేరిన హసరంగ
గాయంతో బాధపడుతున్నా, ఆసియా కప్‌ బెర్త్‌ దక్కించుకున్న స్టార్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ.. గాయం నుంచి పూర్తిగా కోలుకుని లేటుగా జట్టులో చేరాడు. హసరంగ, లియనాగే దుబాయ్‌లో ఉన్న జట్టుతో కలిశారు.

ఆసియా కప్‌లో శ్రీలంక సెప్టెంబర్‌ 13న తొలి పోటీ (బంగ్లాదేశ్‌తో) ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో గ్రూప్‌-బిలో ఉన్న ఆ జట్టు.. సెప్టెంబర్ 15న హాంకాంగ్‌తో, సెప్టెంబర్ 18న ఆఫ్ఘానిస్తాన్తో పోటీపడుతుంది.

శ్రీలంక ఆసియా కప్ 2025 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుం నిస్సాంక, కుసల్ మెండిస్, కుసల్ పెరెరా, నువానిడూ ఫెర్నాండో, కమిందు మెండిస్, కమిల్ మిశారా, దసున్ శానకా, జనిత్ లియనాగే, చామికా కరుణరత్నే, దునిత్ వెలలాగే, వనిందు హసరంగ, మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా, బినురా ఫెర్నాండో, నువాన్ తుషార, మతీషా పథిరానా

 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)