Breaking News

IPL 2025: ఐపీఎల్ వాయిదా.. టికెట్ల డబ్బులు రీఫండ్

Published on Fri, 05/09/2025 - 20:44

పాకిస్తాన్‌-భార‌త్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌ల కార‌ణంగా ఐపీఎల్‌-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆట‌గాళ్ల భ‌ద్ర‌తా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌, వేదికలను ఖారారు చేస్తామని భారత క్రికెట్ బోర్డు తెలిపింది.

దీంతో మే 9(శుక్రవారం) నుంచి మ్యాచ్‌లు ఆగిపోనున్నాయి. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడడంతో ఆయా ఫ్రాంచైజీలు అభిమానులకు టిక్కెట్ల డబ్బులను రీఫండ్ చేయడం ప్రారంభించాయి. షెడ్యూల్ ప్రకారం..ఏక్నా క్రికెట్ స్టేడియం వేదికగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డాల్సింది. 

కానీ వాయిదా ప‌డ‌డంతో టిక్కెట్ల డ‌బ్బుల‌ను వెన‌క్కి ఇచ్చేస్తున్న‌ట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కూడా టిక్కెట్ల డ‌బ్బుల‌ను రీఫండ్ చేస్తామ‌ని వెల్ల‌డించింది. కాగా గురువారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ కూడా అర్ధాంతంగా ర‌ద్దు అయ్యింది. ఐపీఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌లో యూఏఈలో నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)