Breaking News

రన్నరప్‌ అనిరుధ్‌ జోడీ; మూడో సీడ్‌పై సాకేత్‌ జోడీ విజయం

Published on Tue, 04/18/2023 - 08:19

సాక్షి, హైదరాబాద్‌: స్ల్పిట్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ పురుషుల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) జోడీ ఫైనల్లో ఓడిపోయింది.

70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్‌ రెబూల్‌ (ఫ్రాన్స్‌) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌)–కైచి ఉచిడా (జపాన్‌) జంటను ఓడించింది.

క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్‌–విజయ్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్‌ లభించడంతో నేరుగా ఫైనల్‌ ఆడారు. అనిరుధ్‌–విజయ్‌లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

మూడో సీడ్‌పై సాకేత్‌ జోడీ విజయం  
బీఎండబ్ల్యూ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్‌ నథానియల్‌ లామోన్స్‌–జాక్సన్‌ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసింది.    

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?