Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. ఆసీస్‌ పేసర్‌ సరికొత్త చరిత్ర! 39 ఏళ్ల తర్వాత

Published on Wed, 10/07/2026 - 13:06

అహ్మదాబాద్ వేదిక‌గా భార‌త్ అండ‌ర్‌-19తో జ‌రిగిన రెండో అన‌ధికారిక టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 టీమ్ ఓట‌మి పాలైంది. కంగారులు నిర్ధేశించిన 11 ప‌రుగ‌ల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా చేధించింది. అంత‌కుముందు ఆసీస్ యువ‌ జ‌ట్టు త‌మ‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైంది. భార‌త బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 151 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

తొలి ఇన్నింగ్స్‌లో కూడా 174 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌటైంది. భార‌త్ మాత్రం త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 315 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.  అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓట‌మి పాలైన‌ప్ప‌టికి  ఆ జ‌ట్టు పేస‌ర్ స్పెన్సర్ గ్రీన్ మాత్రం ఓ అరుదైన రికార్డ్‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

39 ఏళ్ల త‌ర్వాత‌
స్పెన్సర్ గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. 28 ఓవ‌ర్ల‌లో 110 ప‌రుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తద్వారా యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియా త‌ర‌పున‌ అత్యుత్తమ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన రెండో ప్లేయ‌ర్‌గా గ్రీన్ నిలిచాడు. ఇంత‌కుముందు 1987లో జ‌రిగిన ఓ యూత్ టెస్ట్ మ్యాచ్‌లో స్కాట్ ప్రెస్ట్‌విడ్జ్ 30 ప‌రుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. 

మ‌ళ్లీ 39 ఏళ్ల త‌ర్వాత ఈ అరుదైన ఫీట్‌ను గ్రీన్ న‌మోదు చేశాడు. కాగా భార‌త స్పిన్న‌ర్ త‌న్మ‌య్ బ‌లోడా సైతం అద‌ర‌గొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లు తీసి భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)