Breaking News

Jonathan Trott: ఆఫ్ఘన్‌ క్రికెట్‌ తలరాతను మార్చిన ధీరుడు

Published on Fri, 02/20/2026 - 17:13

జోనాథన్‌ ట్రాట్‌.. ఈ పేరు ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రనే మార్చేసింది. ఈ మాజీ ఇంగ్లీష్‌ ఆటగాడు 2022లో ఆఫ్ఘనిస్తాన్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో ఊహించని అద్భుతాలు చేశాడు. అప్పటివరకు పసికూనగా ఉన్న జట్టును లెజెండ్‌ కిల్లర్‌గా తీర్చిదిద్దాడు. ఆఫ్ఘన్‌తో పోటీ అంటే ఎంతటి జట్టైనా ఉలిక్కిపడే స్థాయికి తీసుకెళ్లాడు. ఆఫ్ఘనిస్తాన్‌ ఇకపై ఎంతమాత్రం చిన్న జట్టు కాదు.. ప్రపంచంలో ఏ జట్టైనైనా ఓడించగలిగే సత్తా ఉన్న జట్టు అని అనుకునేలా చేశాడు.

ఆఫ్ఘన్‌ కోచ్‌గా ట్రాట్‌ పదవీకాలం పూర్తైన నేపథ్యంలో అతను సాధించిన విజయాలు, అతని హయాంలో ఆఫ్ఘన్‌ జట్టు సాధించిన పురోగతిపై ఓ లుక్కేద్దాం.

వాస్తవానికి ట్రాట్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ కోచింగ్‌ బాధ్యతలు అనుకోకుండా దక్కాయి. ఆ స్థానాన్ని మరో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ గ్రహం థోర్ప్‌ భర్తీ చేయాల్సి ఉండింది. అయితే థోర్ప్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటంతో ట్రాట్‌కు లక్కీగా ఈ ఛాన్స్‌ వచ్చింది. ఈ అఫర్‌ను ఒడిసిపట్టుకున్న ట్రాట్‌.. మొదటి రోజు నుంచే తన పని మొదలుపెట్టాడు.

ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, వారిలో స్పూర్తిని రగిల్చడం ప్రారంభించాడు. 2019 వరల్డ్‌కప్‌లో ఆఫ్గన్‌ జట్టు అన్ని మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర నిరాశలో కూరుకొని ఉంది. ఆ సమయంలో ట్రాట్‌ వారికి ఆశాకిరణంలా మారాడు. ఆయన రాకతో జట్టులో క్రమశిక్షణ, వ్యూహాత్మక ఆలోచన, మానసిక దృఢత్వం పెరిగింది. ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడటం మొదలుపెట్టారు.

ట్రాట్‌ బాధ్యతలు చేపట్టాక తొలి సిరీస్‌లోనే ఆఫ్ఘనిస్తాన్‌కు పరాజయం ఎదురైంది. ఐర్లాండ్‌ చేతిలో ఆ జట్టు 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. ట్రాట్‌ క్రమశిక్షణకు తొలి ఫలితం 2022 ఆసియా కప్‌లో వచ్చింది. ఆ టోర్నీలో ఆఫ్ఘన్‌ జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లకు ఊహించని షాకిచ్చింది.

ట్రాట్‌ మార్గదర్శకత్వంలో ఆఫ్ఘన్‌ జట్టు ఆ మురుసటి ఏడాది (2023) మరింత రాటుదేలింది. ఇంగ్లండ్‌పై చారిత్రక విజయం, పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ గెలుపు, శ్రీలంకపై ఆధిపత్యం.. ఇవన్నీ ఒక్కొక్కటిగా సాధ్యమయ్యాయి. ఈ మధ్యలో చిన్న జట్లపై ఆధిపత్యం కూడా తారాస్థాయికి వెళ్లింది. 

2024 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్‌ చేరిన క్షణం ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.  పొట్టి ప్రపంచకప్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘన్‌ జట్టు ఆతర్వాత సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టును కూడా మట్టికరిపించింది. 

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు సంచలనాలు నమోదు చేస్తుందని అంతా ఊహించారు. అయితే దురదృష్టవశాత్తు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ చేతుల్లో ఓడి సూపర్‌-8కు అర్హత సాధించలేకపోయింది. 

అయితే ఈ టోర్నీలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఆ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం (రెండు సూపర్‌ ఓవర్లు) కొదమసింహాల్లా పోరాడాయి. అంతిమంగా సౌతాఫ్రికాదే పైచేయి అయినప్పటికీ.. ఆఫ్ఘన్‌ పోరాటం​ క్రికెట్‌ ఉనికిలో ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది. 

ఆఫ్ఘనిస్తాన్‌ తమ చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో కెనడాపై ఘన విజయం సాధించి, గెలుపుతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచే ట్రాట్‌కు ఆఫ్ఘన్‌ కోచ్‌గా చివరి మ్యాచ్‌. మూడేళ్లపై పైగా పదవీకాలంలో ట్రాట్‌ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఆఫ్ఘన్‌ ఆటగాడు భావోద్వేగానికి గురయ్యాడు. ట్రాట్‌ ఇచ్చిన స్పూర్తితో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు మున్ముందు మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆశిద్దాం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)