Breaking News

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్‌ ఖతం, అత్యంత చెత్త రికార్డులు

Published on Mon, 02/27/2023 - 09:07

స్పెయిన్‌-ఐసిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పర్యాటక జట్టు ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐజిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ చేయకపోగా.. ఏకంగా 6 మంది డకౌట్‌ అయ్యారు.

ఐజిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ 4గా ఉంది. జోసఫ్‌ బుర్రోస్‌ 4 పరుగులు చేయగా.. జార్జ్‌ బుర్రోస్‌, లూక్‌ వార్డ్‌, జాకబ్‌ బట్లర్‌ తలో 2 పరుగులు చేశారు. ఐజిల్‌ ఆఫ్‌ మ్యాన్‌ ఆటతీరు ఎంత చెత్తగా సాగిందో ఈ గణంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. స్పెయిన్‌ బౌలర్లలో మహ్మద్‌ కమ్రాన్‌ (4-1-4-4), అతీఫ్‌ మెహమూద్‌ (4-2-6-4) తలో 4 వికెట్లు పడగొట్టగా, లోర్న్‌ బర్న్స్‌ (0.4-0-0-2) 2 వికెట్లు దక్కించుకున్నాడు.

అనంతరం 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పెయిన్‌.. కేవలం 2 బంతుల్లోనే ఆటను ముగించింది. తొలి బంతిని జోసఫ్‌ బుర్రోస్‌ నో బాల్‌ వేయగా.. ఆ తర్వాత రెండు బంతులను అవైస్‌ అహ్మద్‌ సిక్సర్లుగా మలిచి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌ పలు చెత్త రికార్డులకు వేదికైంది. పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్‌ (10 ఆలౌట్‌), ఛేదనలో ఫాస్టెస్ట్‌ రన్‌రేట్‌ (39), బంతుల తేడా పరంగా విజయం (118 బంతులు) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)