Breaking News

భారత్‌కు స్పెయిన్‌ షాక్‌

Published on Fri, 12/08/2023 - 04:04

కౌలాలంపూర్‌: జూనియర్‌ పురుషుల అండర్‌–21 ప్రపంచకప్‌ హాకీ టోర్నీలో భారత్‌కు ఊహించని ఫలితం ఎదురైంది.  గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్‌  గ్రూప్‌ ‘సి’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో 1–4 గోల్స్‌ తేడాతో స్పెయిన్‌ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో విజయంతో స్పెయిన్‌ జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 4–2తో నెగ్గి శుభారంభం చేసిన భారత జట్టుకు రెండో మ్యాచ్‌లో స్పెయిన్‌ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.

ఆట తొలి నిమిషంలోనే పాల్‌ క్యాబిర్‌ వెర్డెల్‌ గోల్‌తో స్పెయిన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 18వ నిమిషంలో ఆండ్రెస్‌ రాఫి గోల్‌తో స్పెయిన్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. 33వ నిమిషంలో రోహిత్‌ గోల్‌ సాధించడంతో భారత్‌ ఖాతా తెరిచింది. అయితే స్పెయిన్‌ జోరు తగ్గించకుండా ఆడుతూ ఎనిమిది నిమిషాల తర్వాత మూడో గోల్‌ చేసింది. పాల్‌ క్యాబిర్‌ వెర్డెల్‌ గోల్‌తో స్పెయిన్‌ 3–1తో ముందంజ వేసింది. మ్యాచ్‌ చివరి నిమిషంలో ఆండ్రెస్‌ రాఫి గోల్‌తో స్పెయిన్‌ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో ఏడు పెనాల్టీ కార్నర్‌లు రాగా కేవలం ఒక దానిని సహాకీ టోర్నీ  నియోగం చేసుకుంది.

మరో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 4–1తో కెనడాను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ రేసులో నిలిచింది. శనివారం జరిగే చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో కెనడాతో భారత్‌; కొరియాతో స్పెయిన్‌ తలపడతాయి. కొరియా–స్పెయిన్‌ మ్యాచ్‌ తర్వాతే భారత జట్టు మ్యాచ్‌ జరుగుతుంది. ఒకవేళ స్పెయిన్‌ చేతిలో కొరియా ఓడితే భారత్‌ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంటుంది. ఒకవేళ స్పెయిన్‌పై కొరియా గెలిస్తే మాత్రం భారత్‌ భారీ తేడాతో కెనడాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.   
 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)