Breaking News

స్పెయిన్‌ను ఆపతరమా!

Published on Fri, 07/10/2026 - 01:43

లాస్‌ ఏంజెలిస్‌: గత మూడు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయిన 2010 విశ్వవిజేత స్పెయిన్‌ తాజా ప్రపంచకప్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా కొనసాగుతోంది. అంతేకాకుండా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న క్రమంలో ప్రత్యర్థి జట్లకు ఒక్క గోల్‌ కూడా ఇవ్వని ఒకే ఒక జట్టు స్పెయిన్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో నేడు మరో కీలకపోరుకు స్పెయిన్‌ సిద్ధమైంది. బెల్జియం జట్టుతో క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో స్పెయిన్‌ తలపడనుంది. 2010లో ఏకైకసారి ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచిన స్పెయిన్‌... ఆ తర్వాత నిరాశపరిచింది. 

2014లో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. 2018లో, 2022లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. ఈసారి మాత్రం నిలకడగా రాణిస్తూ క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వచ్చింది. మికెల్‌ ఒయర్‌జబాల్‌ నాలుగు గోల్స్‌తో స్పెయిన్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతుండగా... అలెక్స్‌ బేనా, మికెల్‌ మెరీనో, పెడ్రో పోరో, లామినె యామల్‌ ఒక్కో గోల్‌ చేశారు. వీరందరూ సమష్టిగా రాణించడంపై స్పెయిన్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. 

మరోవైపు నాలుగోసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన బెల్జియం జట్టు కూడా ఈ టోర్నీలో అజేయంగా ఉంది. గ్రూప్‌ దశలో ఒక మ్యాచ్‌లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకున్న బెల్జియం... నాకౌట్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 3–2తో సెనెగల్‌ జట్టుపై... ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 4–1తో అమెరికా జట్టుపై గెలిచింది. లుకాకు, చార్లెస్‌ కెటెలెర్, యురీ టిలెమాన్స్, ట్రొసార్డ్, కెవిన్‌ డిబ్రున్, సేల్‌మికర్స్, హాన్స్‌ వానాకెన్‌ బెల్జియం విజయాల్లో కీలకపాత్ర పోషించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)