Breaking News

అరుదైన క్లబ్‌లో చేరిన సౌతాఫ్రికా కెప్టెన్‌

Published on Fri, 08/09/2024 - 16:34

సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ టెంబా బవుమా అరుదైన క్లబ్‌లో చేరాడు. టెస్ట్‌ల్లో 3000 పరుగుల మార్కు తాకిన 17వ సౌతాఫ్రికా ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బవుమా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులు చేసిన బవుమా 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద 3000 పరుగుల మార్కును క్రాస్‌ చేశాడు. 

కెరీర్‌లో 57 టెస్ట్‌లు ఆడిన బవుమా 2 సెంచరీలు, 21 హాఫ్‌ సెంచరీల సాయంతో 3083 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు జాక్‌ కల్లిస్‌ పేరిట ఉంది. కల్లిస్‌ 165 మ్యాచ్‌ల్లో 13206 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్‌ టెండూల్కర్‌కు దక్కుతుంది. సచిన్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో 15921 పరుగులు చేశాడు. సచిన్‌ తర్వాతి స్థానంలో పాంటింగ్‌ (13378) ఉన్నాడు.

కాగా, ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. వర్షం కారణంగా తొలి రోజు ఆట దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా.. రెండో రోజు సజావుగా సాగింది. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బవుమా, ఓపెనర్‌ టోనీ డి జోర్జీ (78) అర్ద సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్‌ మార్క్రమ్‌ 9, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 20, డేవిడ్‌ బెడింగ్హమ్‌ 29, ర్యాన్‌ రికెల్టన్‌ 19, కైల్‌ వెర్రిన్‌ 39, కేశవ్‌ మహారాజ్‌ 0 పరుగులు చేసి ఔటయ్యారు. వియాన్‌ ముల్దర్‌ (37), రబాడ (12) బ్యాటింగ్‌ కొనసాగిస్తున్నారు. విండీస్‌ బౌలర్లలో జోమెల్‌ వార్రికన్‌ 3, కీమర్‌ రోచ్‌, జేడన్‌ సీల్స్‌ తలో 2, జేసన్‌ హోల్డర్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)