Breaking News

IND vs SA: ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Published on Wed, 05/07/2025 - 03:43

కొలంబో: ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నీలో ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా భారత మహిళల జట్టు నేడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక చెక్‌ పెట్టింది. దీంతో వరుసగా 8 విజయాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. ఈ పరాభవం నుంచి వెంటనే బయట పడాలని, ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలనే కసితో హర్మన్‌ప్రీత్‌ బృందం బరిలోకి దిగుతోంది. నిజానికి భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనే క్లిష్టమైన సమీకరణమైతే లేదు. అమ్మాయిల బృందం రెండు విజయాలు, నెట్‌రన్‌రేట్‌ పరంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయినాసరే తుదిపోరుకు ముందే మళ్లీ గెలుపుబాట పట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. మరోవైపు ఇంతవరకు అసలు బోణీనే కొట్టలేకపోయిన సఫారీ మహిళల జట్టు లంక గడ్డపై పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. 

ఫేవరెట్‌గా... 
ఈ సిరీస్‌లో గత పరాజయం మినహా భారత జట్టు అన్ని రంగాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌లో ప్రతీక రావల్‌ సూపర్‌ఫామ్‌ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలు సహా 163 పరుగులతో సత్తా చాటుకుంది. స్మృతి మంధాన తన బ్యాటింగ్‌ పవర్‌ను చూపెట్టాల్సి ఉంది. హర్లీన్‌ డియోల్, కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మలు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో స్నేహ్‌ రాణా ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి శ్రీచరణితో పాటు హైదరాబాద్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి, కాశ్వీ గౌతమ్‌లు కూడా నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.  

ఒత్తిడిలో దక్షిణాఫ్రికా 
ఈ టోరీ్నలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సఫారీ అమ్మాయిల జట్టు గెలుపు కోసం పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్ల నిలకడలేమి జట్టుకు ప్రతికూలంగా మారింది. కెపె్టన్‌ లారా వోల్వర్ట్, తజ్‌మిన్‌ బ్రిట్స్‌ భారత్‌తో గత మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ లంకతో చేతులెత్తేశారు. గుడాల్, మెసో, సునే లుస్‌ సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్‌కు సవాల్‌ విసురుతుంది. లేదంటే ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్‌’ ఓటమి తప్పదు! ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనక దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతే ఆఖరి పోరుతో సంబంధం లేకుండా ఆతిథ్య లంక, భారత జట్లు అమీతుమీకి అర్హత సంపాదిస్తాయి.  

తుదిజట్లు (అంచనా) 
భారత్‌: హర్మన్‌ప్రీత్, ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్‌ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతీ, స్నేహ్‌ రాణా, శ్రీ చరణి. దక్షిణాఫ్రికా: లారా వోల్వర్ట్, తజ్‌మిన్‌ బ్రిట్స్, లారా గుడాల్, కరబొ మెసో, సునే లూస్, క్లొ ట్రయాన్, డెర్క్‌సన్, నదిన్‌ డిక్లెర్క్, మసబత క్లాస్, ఎమ్‌లాబా, అయ»ొంగ కాకా.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)