Breaking News

WTC Final 2025: నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేస‌ర్లు.. క‌ష్టాల్లో ఆసీస్‌

Published on Thu, 06/12/2025 - 15:22

218 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించారు. కగిసో రబాడ, ఎంగిడీ చెరో 3 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సెన్‌, ముల్డర్‌ చెరో వికెట్‌ తీశారు. ఇక ఈ ఇన్నింగ్స్‌కు ఆసీస్‌ బ్యాటర్లలో అలెక్స్‌ క్యారీ 43(50) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు.

164 ప‌రుగుల ఆధిక్యంలో ఆసీస్‌
32 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 164 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. క్రీజులో క్యారీ(14), మిచెల్ స్టార్క్‌(5) ఉన్నారు.
ఆలౌట్ దిశగా ఆస్ట్రేలియా.. 
ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కమ్మిన్స్‌.. ఎంగిడీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 27 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 152 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. 

ఆసీస్ ఆరో వికెట్ డౌన్‌..
ట్రావిస్ హెడ్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హెడ్‌.. ముల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.

నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేస‌ర్లు.. క‌ష్టాల్లో ఆసీస్‌
రెండో ఇన్నింగ్స్‌లో సైతం సౌతాఫ్రికా పేస‌ర్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రోటీస్ బౌల‌ర్ల దాటికి ఆసీస్ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. వెబ్‌స్టెర్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన వెబ్‌స్టెర్ ఎంగిడీ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 23 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 64 ప‌రుగులు చేసింది.

ఆసీస్‌ నాలుగో వికెట్ డౌన్‌..
స్టీవ్‌ స్మిత్‌ రూపంలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన స్మిత్‌.. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆసీస్ మూడో వికెట్ డౌన్‌
మార్న‌స్ ల‌బుషేన్ రూపంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన లబుషేన్‌.. జానెస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 18. 4 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోర్‌: 48/3

ఆసీస్ రెండో వికెట్ డౌన్‌
కామెరూన్ గ్రీన్‌(0) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో  గ్రీన్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్‌(4), లబుషేన్‌(16) ఉన్నారు.
ఆసీస్ తొలి వికెట్ డౌన్‌
ఉస్మాన్ ఖ‌వాజా రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 6 ప‌రుగులు చేసిన ఖ‌వాజా.. ర‌బాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి గ్రీన్ వ‌చ్చాడు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న ఆసీస్ ఓపెన‌ర్లు..
ఆస్ట్రేలియా త‌మ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిల‌క‌డ‌గా ఆడుతోంది. 9 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోకుండా 24 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్న‌స్ ల‌బుషేన్‌(15), ఖ‌వాజా(4) ఉన్నారు. ఆసీస్ ప్ర‌స్తుతం 98 ప‌రుగుల ఆధిక్యం కొన‌సాగుతోంది.
138 ప‌రుగుల‌కే సౌతాఫ్రికా ఆలౌట్‌
లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు సైతం చేతులేత్తేశారు.  ఆసీస్ బౌల‌ర్ల దాటికి సౌతాఫ్రికా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 138 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ 6 వికెట్లు ప‌డ‌గొట్టి ప్రోటీస్ ప‌తానాన్ని శాసించాడు. అత‌డితో పాటు స్టార్క్ రెండు వికెట్లు, హాజిల్‌వుడ్ వికెట్ సాధించారు. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో బెడింగ్‌హామ్(45) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

క‌మ్మిన్స్ ఆన్ ఫైర్‌.. సౌతాఫ్రికా ఏడో వికెట్ డౌన్‌
లంచ్ బ్రేక్ అనంత‌రం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. 52వ ఓవ‌ర్ వేసిన క‌మ్మిన్స్‌.. మూడో బంతికి వెర్రియిన్‌ను పెవిలియ‌న్‌కు పంప‌గా.. ఆఖ‌రి బంతికి జానెస‌న్‌ను ఔట్ చేశాడు. 52 ఓవ‌ర్ల‌కు సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 126 ప‌రుగులు చేసింది.

లంచ్ బ్రేక్‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరంతంటే?
ఆస్ట్రేలియా-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ స‌మ‌యానికి సౌతాఫ్రికా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల న‌ష్టానికి 121 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఇంకా 91 ప‌రుగుల వెనకంజ‌లో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో బెడింగ్‌హామ్‌(39),వీర్రెయిన్‌(9) ఉన్నారు.

సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్‌.. కెప్టెన్ బావుమా ఔట్‌
టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 36 ప‌రుగులు చేసిన బావుమా.. క‌మ్మిన్స్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న బావుమా, బెడింగ్‌హామ్
35 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బెడింగ్‌హామ్(17 బ్యాటింగ్‌), బావుమా(36 బ్యాటింగ్‌) నిలకడగా ఆడుతున్నారు.

27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్‌: 66/4
27 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(17), బెడింగ్‌హమ్‌(17) ఉన్నారు.

లార్డ్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మ‌ధ్య‌ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ రెండో రోజు ఆట ప్రారంభ‌మైంది. ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను మిచెల్ స్టార్క్ ప్రారంభించాడు. క్రీజులో ప్ర‌స్తుతం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా(3), బెడింగ్‌హామ్(8) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన సంగ‌తి తెలిసిందే. 

అంత‌కుముందు బ్యాటింగ్‌కు చేసిన ఆస్ట్రేలియా త‌మ తొలి ఇన్నింగ్స్‌లో  56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్‌ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్‌ స్మిత్‌ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్‌ 3 వికెట్లు తీశాడు.

 

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)