Breaking News

ఇండియా టూర్‌.. సౌతాఫ్రికా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌! కెప్టెన్ ఎవ‌రంటే?

Published on Fri, 10/17/2025 - 08:13

సౌతాఫ్రికా క్రికెట్ జ‌ట్టు ఈ ఏడాది నవంబ‌ర్‌లో భార‌త పర్య‌ట‌న‌కు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ప్రోటీస్ ఆతిథ్య జ‌ట్టుతో రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. న‌వంబ‌ర్ 14న కోల్‌క‌తా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుతో సౌతాఫ్రికా జ‌ట్టు ఇండియా ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. అయితే ఈ మ‌ల్టీ ఫార్మాట్ సిరీస్ ఆరంభానికి ముందు ద‌క్షిణాఫ్రికా-ఎ జ‌ట్టు కూడా భార‌త్‌కు రానుంది.

రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో ఇండియా-ఎ జ‌ట్టును ప్రోటీస్‌-ఎ జ‌ట్టు ఢీకొట్ట‌నుంది. అక్టోబ‌ర్ 30 నుంచి సౌతాఫ్రికా-ఎ జ‌ట్టు ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల అనాధికారిక టెస్టు సిరీస్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జ‌ర‌గ‌నుండ‌గా.. మూడు వ‌న్డేల‌కు సిరీస్‌కు రాజ్‌కోట్ ఆతిథ్య‌మివ్వ‌నుంది.

ఈ క్ర‌మంలో భార‌త్ టూర్‌కు సౌతాఫ్రికా-ఎ జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. రెండు సిరీస్‌ల‌లోనూ ప్రోటీస్ జ‌ట్టు కెప్టెన్‌గా మార్క్వెస్ జానీ అకెర్‌మాన్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. అదేవిధంగా సౌతాఫ్రికా సీనియ‌ర్ జ‌ట్టు కెప్టెన్ టెంబా బావుమా కూడా ఈ జ‌ట్టులో ఉన్నాడు.

వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ 2023-25 ఫైన‌ల్‌లో గాయ‌ప‌డిన బావుమా.. అప్ప‌టినుంచి జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఓ వైపు గాయంతో పోరాడుతూనే.. 27 సంవత్సరాల తర్వాత తన జట్టుకు తొలి ఐసీసీ టైటిల్‌ను అందించాడు. గాయం కార‌ణంగా పాకిస్తాన్ టూర్‌కు బావుమా దూర‌మ‌య్యాడు.

 అత‌డి స్ధానంలో ఐడైన్ మార్‌క్ర‌మ్ స‌ఫారీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పుడు భార‌త్‌తో సిరీస్‌కు ముందు తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించాల‌ని టెంబా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ఇండియా-ఎతో జ‌రిగే రెండో టెస్టులో అత‌డు ఆడ‌నున్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉంటాడ‌ని సౌతాఫ్రికా క్రికెట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అనధికారిక టెస్టుల కోసం సౌతాఫ్రికా జట్టు: మార్క్వెస్ అకెర్‌మాన్, టెంబా బావుమా*, ఓకుహ్లే సెలె, జుబేర్ హంజా, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, లెసెగో సెనోక్వానే, లెసెగో సెనోక్వానే, ప్రెనెలన్ సుబ్రాయెన్, కైల్ సిమ్మండ్స్, త్సెపో ద్వాండ్వా, జాసన్ స్మిత్, టియాన్ వాన్ వురెన్, కోడి యూసుఫ్.

వన్డేల కోసం సౌతాఫ్రికా  జట్టు: మార్క్వెస్ అకెర్‌మాన్, ఒట్నీల్ బార్ట్‌మన్, బ్జోర్న్ ఫోర్టుయిన్, జోర్డాన్ హెర్మాన్, రూబిన్ హెర్మాన్, క్వేనా మఫాకా, రివాల్డో మూన్‌సామి, త్షెపో మోరెకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, న్కాబా పీటర్, డెలానో పోట్‌గీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెథెంబ క్యూషీలే, జాసన్ స్మిత్, కోడి యూసుఫ్.
చదవం‍డి: హైదరాబాద్‌లో మెరుపులు.. ఇద్దరు డబుల్‌ సెంచరీలు.. ఏకంగా 529 రన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)