Breaking News

సౌతాఫ్రికాకు భారీ షాక్‌లు

Published on Thu, 10/23/2025 - 18:38

పాకిస్తాన్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్‌లు తగిలాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్‌ డేవిడ్‌ మిల్లర్‌ (David Miller), కీలక​ బౌలర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ (Gerald Coetzee) గాయాల కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యారు. 

మిల్లర్‌ కొద్ది రోజుల కిందట ప్రాక్టీస్‌ చేస్తూ గ్రేడ్‌-1 హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరికి గురి కాగా.. కొయెట్జీ నబీమియాతో ఇటీవల జరిగిన టీ20 సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు పాక్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యారు.

మిల్లర్‌ గైర్హాజరీలో టీ20 జట్టు కెప్టెన్‌గా అప్పటికే జట్టులో ఉన్న డొనోవన్‌ ఫెరీరాను ఎంపిక చేశారు. మిల్లర్‌ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కే భర్తీ చేశారు. కొయెట్జీ స్థానాన్ని టీ20ల్లో టోనీ డి జోర్జితో, వన్డేల్లో ఓట్నీల్‌ బార్ట్‌మన్‌తో భర్తీ చేశారు. ఈ రెండు మార్పులు మినహా ముందుగా ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగనుంది.

పాక్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి  మ్యాచ్‌ రావల్పిండి వేదికగా.. రెండో టీ20 అక్టోబర్‌ 31న లాహోర్‌ వేదికగా.. మూడో టీ20 నవంబర్‌ 1న అదే లాహోర్‌ వేదికగా జరుగనున్నాయి.

అనంతరం నవంబర్‌ 4 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. నవంబర్‌ 4, 6, 8 తేదీల్లో ఫైసలాబాద్‌ వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు సౌతాఫ్రికా పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడింది. 

ఇవాళే (అక్టోబర్‌ 23) ముగిసిన ఈ సిరీస్‌ 1-1తో డ్రా అయ్యింది. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్‌, రెండో టెస్ట్‌లో పర్యాటక సౌతాఫ్రికా గెలుపొందాయి.

పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్‌కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి, న్‌క్వాబా పీటర్‌, లూహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, అండైల్‌ సైమ్‌లేన్‌, లిజాడ్‌ విలియమ్స్

వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి, న్‌క్వాబా పీటర్, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, సినేతెంబా క్వెషైల్‌, లిజాడ్‌ విలియమ్స్‌

చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్‌ సెంచరీ
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)