ఆస్ట్రేలియా పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డబ్ల్యూటీసీ హీరోల ఎంట్రీ

Published on Thu, 07/24/2025 - 16:06

ఆగస్ట్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జులై 24) ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్స్‌ హీరోలు బవుమా, మార్క్రమ్‌ రీఎంట్రీ ఇవ్వనున్నారు. 

వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్‌ మార్క్రమ్‌ సారథ్యం వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. మార్క్రమ్‌ మరికొందరు సీనియర్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మధ్యలో సౌతాఫ్రికా జింబాబ్వేతో 2 టెస్ట్‌లు, ప్రస్తుతం ముక్కోణపు సిరీస్‌ (జింబాబ్వే, న్యూజిలాండ్‌) ఆడుతుంది.

ఇటీవలే టెస్ట్‌ అరంగేట్రం చేసిన ఆఫ్‌ స్పిన్నర్‌ ప్రెనెలన్‌ సుబ్రాయెన్‌ సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. అలాగే హార్డ్‌ హిట్టర్‌ లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌ కూడా తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. జింబాబ్వే సిరీస్‌తో టెస్ట్‌ అరంగేట్రం చేసిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్‌ బ్రెవిస్‌ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు.

సీనియర్లు మార్క్రమ్‌, ర్యాన్‌ రికెట్లన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కార్బిన్‌ బాష్‌, నండ్రే బర్గర్‌, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌తో సిరీస్‌ ఆగస్ట్‌ 10న మొదలుకానుంది. 10, 12, 16 తేదీల్లో టీ20లు.. 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.

ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్, కగిసో రబడా, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ప్రెనెలన్‌ సుబ్రాయెన్‌, రస్సీ వాన్‌డర్‌ డస్సెన్‌

ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్రమ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్‌ డ్రి ప్రిటోరియస్‌, కగిసో రబాడ, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ప్రెనెలన్‌ సుబ్రాయెన్‌ 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)