Breaking News

గట్టెక్కిన దక్షిణాఫ్రికా

Published on Sun, 06/09/2024 - 04:27

న్యూయార్క్‌: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చెమటోడ్చి రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌ ‘డి’లో శనివారం జరిగిన పోరులో సఫారీ 4 వికెట్లతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్‌ నెగ్గిన సఫారీ ఫీల్డింగ్‌ ఎంచుకోగా మొదట బ్యాటింగ్‌ చేపట్టిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్లు మైకేల్‌ లెవిట్‌ (0), మ్యాక్స్‌ ఓ డౌడ్‌ (2) సహా టాపార్డర్‌లో విక్రమ్‌జీత్‌ (12) కూడా నిరాశపరిచారు. 

ఈ దశలో సైబ్రాండ్‌ (45 బంతుల్లో 40; 2 ఫోర్లు, 1 సిక్స్‌) దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ లొగాన్‌ వాన్‌ బిక్‌ (23; 3 ఫోర్లు) అండతో జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా ఐదో ఓవర్‌ ముగియకముందే 12 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోవడంతో వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఫలితం పునరావృతమవుతుందేమో అనిపించింది. 

అయితే ట్రిస్టన్‌ స్టబ్స్‌ (37 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్‌)కు జతయిన మిల్లర్‌ (51 బంతుల్లో 59 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించి పరిస్థితి చక్కబెట్టాడు. అనంతరం అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)