Breaking News

దక్షిణాఫ్రికా ధమాకా

Published on Wed, 10/29/2025 - 21:35

గువాహటి: ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు అనుకున్నది సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాలుగుసార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టుతో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాట్‌తో కెపె్టన్‌ లారా వోల్‌వార్ట్‌ (143 బంతుల్లో 169; 20 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బంతితో మరిజాన్‌ కాప్‌ (5/20) అదరగొట్టి తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.  మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 319 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ వోల్‌వర్ట్‌ అసాధారణ ఆటతీరుతో ఇంగ్లండ్‌ బౌలర్ల భరతం పట్టింది. బ్రిట్స్‌ (65 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), మరిజాన్‌ కాప్‌ (42; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ట్రియాన్‌ (33 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా కీలక పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్‌  4 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సఫారీ బౌలర్ల ధాటికి స్కోరు బోర్డుపై ఒక పరుగుకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ ఆ తర్వాత కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 

కెప్టెన్‌ నటాలియా సివర్‌ బ్రంట్‌ (76 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్‌), అలీస్‌ కాప్సీ (71 బంతుల్లో 50; 6 ఫోర్లు) పోరాడారు. అమీ జోన్స్‌ (0), బ్యూమౌంట్‌ (0), హీథర్‌ నైట్‌ (0) డకౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ కోలుకోలేకపోయింది. డంక్లీ (2), చార్లీ డీన్‌ (0) కూడా విఫలమయ్యారు. నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికా తలపడనుంది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)