వరల్డ్‌కప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌!

Published on Thu, 09/21/2023 - 07:50

భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, వరల్డ్‌క్లాస్‌ ఫాస్ట్‌ బౌలర్ అన్రిచ్‌ నోర్జే గాయం కారణంగా వరల్డ్‌కప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్న నోర్జే కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా నోర్జే గాయపడ్డాడు. నొప్పి తీవ్రం కావడంతో మెరుగైన చికిత్స కోసం.. 29 ఏళ్ల నోర్జేను వెంటనే జొహన్నస్‌బర్గ్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్‌ పంపింది. ఈ క్రమంలో సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. కాగా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటిస్‌ జట్టులో నోర్జే కూడా భాగంగా ఉన్నాడు.

నోర్జే దూరమైతే దక్షిణాఫ్రికాకు మాత్రం గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. మరోవైపు ఈ మెగా టోర్నీకి ఎంపికైన ప్రోటీస్‌ పేసర్‌ సిసంద మగల సైతం మోకాలి గాయంతో భాదపడుతున్నాడు. అయితే అతడు వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక మెగా ఈవెంట్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: మహ్మద్‌ సిరాజ్‌ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్‌ యు పాపా’ అంటూ!

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)