Breaking News

పాకిస్తాన్‌ కాదు... సౌతాఫ్రికా వేదికగా ఛాంపియన్స్‌ ట్రోఫీ!?

Published on Tue, 11/12/2024 - 11:32

పాకిస్తాన్‌ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సి ఉన్న ఛాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధం వీడలేదు. ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ- పీసీబీ మధ్య విభేదాల నేపథ్యంలో వేదిక మార్పు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. భార‌త జ‌ట్టును పాకిస్తాన్‌కు పంపేది లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసింది.

 టోర్నీని హైబ్రిడ్ మోడ‌ల్‌లో  నిర్వ‌హించాల‌ని బీసీసీఐ  ఐసీసీని అభ్య‌ర్దించింది. అందుకు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా అంగీక‌రించింది. ఈ క్ర‌మంలో భార‌త్ ఆడే మ్యాచ్‌ల‌ను హైబ్రిడ్ మొడ‌ల్‌లో యూఏఈలో నిర్వ‌హించాల‌ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఐసీసీ కోరింది.

సౌతాఫ్రికా వేదిక‌గా ఛాంపియ‌న్స్ ట్రోఫీ..!
స్పోర్ట్స్ టాక్ క‌థ‌నం ప్రకారం.. ఐసీసీ డిమాండ్‌ను పీసీబీ అంగీకరించకపోతే  ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఆతిథ్య హ‌క్కుల‌ను పాకిస్తాన్ కోల్పోనున్న‌ట్లు తెలుస్తోంది. ఐసీసీ త‌మ‌కు ఉన్న విశిష్ట అధికారాలతో పాక్ హోస్టింగ్ రైట్స్‌ను లాక్ చేయనున్నట్లు సమాచారం.

ఒక వేళ అదే జరిగితే టోర్నీ మొత్తాన్ని సౌతాఫ్రికాలో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోందంట. మరోవైపు తమ ఆతిథ్య హక్కులను తగ్గిస్తే ఏకంగా టోర్నీ నుంచే వైదొలగాలని పాక్‌ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఇకపై భారత్‌లో జరిగే మరే ఇతర ఐసీసీ ఈవెంట్‌లకు తమ జట్టును పంపకూడదని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
చదవండి: అదొక పగటి కల.. భారత్‌కు పీసీబీ స్ట్రాంగ్‌ రిప్లై ఇవ్వాలి: పాక్‌ మాజీ కెప్టెన్‌

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)