చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్‌ క్రికెట్‌లో తొలి జట్టు

Published on Sun, 10/12/2025 - 14:59

సౌతాఫ్రికా జాతీయ క్రికెట్‌ జట్టు (South Africa) సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 147 టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టు నాలుగు వరుస మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చలేదు.

సౌతాఫ్రికా కెప్టెన్ల మార్పు యాదృచ్చికంగా జరిగింది. 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాత జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ టెంబా బవుమాకు (Temba Bavuma) విశ్రాంతి కల్పించారు. 

ఆ సిరీస్‌కు కేవశ్‌ మహారాజ్‌ (Keshav Maharaj) కెప్టెన్‌గా ఎంపిక కాగా.. తొలి టెస్ట్‌లో అతను గాయపడ్డాడు. దీంతో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. మహారాజ్‌ స్థానంలో రెండో టెస్ట్‌లో కెప్టెన్‌గా వియాన్‌ ముల్దర్‌ (Wiaan Mulder) వ్యవహరించాడు.

తాజాగా పాకిస్తాన్‌ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు రెగ్యులర్‌ కెప్టెన్‌ బవుమా అందుబాటులోకి రావాల్సింది. అయితే ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన వైట్‌ బాల్‌ సిరీస్‌ సందర్భంగా బవుమా గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఎయిడెన్‌ మార్క్రమ్‌కు (Aiden Markram) పాకిస్తాన్‌ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఇవాళే (అక్టోబర్‌ 12) ప్రారంభమైంది. లాహోర్‌ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మార్క్రమ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

53 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 188 పరుగులుగా ఉంది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ (2), కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ (76) ఔట్‌ కాగా.. మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌ (86), బాబర్‌ ఆజమ్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. పాక్‌ బౌలర్లలో ప్రెనెలన్‌ సుబ్రాయన్‌, కగిసో రబాడకు తలో వికెట్‌ దక్కింది.

చదవండి: IND vs WI: కుల్దీప్‌ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)