Breaking News

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా

Published on Sun, 11/16/2025 - 21:05

సౌతాఫ్రికా క్రికెట్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌ను అద్భుత‌మైన విజ‌యంతో ఆరంభించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 30 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా గెలుపొందింది. 124 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని స‌ఫారీ బౌల‌ర్లు డిఫెండ్ చేసి అద్భుతం చేశారు.

ల‌క్ష్య చేధ‌న‌లో భార‌త్ కేవ‌లం 93 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ప్రోటీస్ స్పిన్న‌ర్ సైమ‌న్ హార్మ‌ర్ నాలుగు వికెట్ల ప‌డ‌గొట్టి టీమిండియాను దెబ్బ తీశాడు. అత‌డితో కేశవ్ మ‌హారాజ్‌, జానెస‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డును త‌మ పేరిట లిఖించుకుంది.

తొలి జట్టుగా రికార్డు..
👉ఈడెన్ గార్డెన్స్ మైదానంలో టెస్టుల్లో లోయోస్ట్ టోట‌ల్ డిఫెండ్ చేసిన జ‌ట్టుగా ప్రోటీస్ నిలిచింది. ఇంత‌కుముందు రికార్డు భార‌త జ‌ట్టు పేరిట ఉండేది. ఈ వేదిక‌లో 1973లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 192 ప‌రుగుల‌ను టీమిండియా కాపాడుకుంది. తాజా మ్యాచ్‌లో 124 ప‌రుగులను డిఫెండ్ చేసుకున్న సౌతాఫ్రికా.. భార‌త్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.

👉అదేవిధంగా సౌతాఫ్రికా స్పిన్న‌ర్ సైమ‌న్ హార్మ‌ర్ కూడా ఓ రికార్డు సాధించాడు. భార‌త్‌పై ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన స‌ఫారీ ప్పిన్న‌ర్‌గా హార్మ‌ర్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి అత‌డు 51 ప‌రుగులిచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు పాల్ ఆడ‌మ్స్ పేరిట ఉండేది. 1996లో కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడమ్స్ 139 ప‌రుగులిచ్చి 8 వికెట్లు ప‌డ‌గొట్టాడు.
చదవండి: IND vs SA: బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్‌
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)