Breaking News

AUS Vs SA: అసాధ్యం సుసాధ్యమైన రోజు!

Published on Thu, 03/12/2026 - 16:06

క్రికెట్‌  చరిత్రలో కొన్ని మ్యాచ్‌లు చిరకాలం గుర్తుండిపోతాయి. రెండు కొదమసింహాలు ఒకటిని మించి మరొకటి తలపడితే వచ్చే మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే విధంగా క్రికెట్‌ అభిమానులను సైతం ఆద్యంతం మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్‌ కూడా ఒకటి ఉంది. 

ఆఖరిదాకా నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విజయం ఎవరిదన్నది పక్కనబెడితే అభిమానులకు మాత్రం చెప్పలేనంత జోష్‌ను ఇచ్చింది. అదే మార్చి 12, 2006లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌. టీ20లు పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోవడంతో మ్యాచ్‌లన్నీ వన్డే, టెస్టు ఫార్మాట్‌లోనే ఎక్కువగా జరుగుతుండేవి. అప్పట్లో వన్డేల్లో 400 పరుగులు చేయడం గొప్పగా చూసేవారు. కానీ ఒత్తిడి తట్టుకొని రెండో ఇన్నింగ్స్‌లో టార్గెను ఛేదించడమే గాక రెండు ఇన్నింగ్స్‌లకు కలిపి  800 పరుగులకు నమోదవ్వడం చిన్న విషయం కాదు. 

తాజాగా మ్యాచ్‌కు నేటితో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి గుర్తుకు చేసుకుందాం.మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 434 పరుగుల భారీ స్కోరు చేసింది. అప్పటివరకు వన్డే క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ 164 పరుగులతో యాంకర్‌ పాత్ర పోషించగా, గిల్‌క్రిస్ట్‌ (55), సైమన్‌ కటిచ్‌ (79), మైక్‌ హస్సీ (81) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే కొండంత లక్ష్యం చూశాకా రెండో బ్యాటింగ్‌కు దిగే ఏ జట్టైనా భయపడాల్సిందే. 

కానీ సౌతాఫ్రికా మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా ఇన్నింగ్స్‌ ఆడడం మొదలెట్టింది. కొండంత స్కోరు టార్గెట్‌గా ఉంచడంతో ఆస్ట్రేలియా కూడా మొదట్లో సఫారీల ఇన్నింగ్స్‌ను లైట్‌ తీసుకుంది. కానీ ఓపెనర్‌ హర్షలే గిబ్స్‌ (175 పరుగులు), గ్రేమీస్మిత్‌ (90 పరుగులు) మొదటి నుంచే ధాటిగా ఆడడంతో సౌతాఫ్రికా స్కోరు పరుగులెత్తింది. చూస్తుండగానే లక్ష్యం కరిగిపోతు వచ్చింది. 

అయితే మధ్యలో సౌతాఫ్రికా వికెట్లు కోల్పోయినప్పటికీ మార్క్‌ బౌచర్‌ (50 నాటౌట్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడి ఒక బంతి మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ఇక క్రికెట్‌ చరిత్రలో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమంటే ఇదేనేమో అనిపించింది. అప్పటిదాకా వన్‌సైడ్‌ భారీ స్కోర్లు ఎక్కువగా కనిపించేవి. 

కానీ ఈ మ్యాచ్‌ తర్వాత భారీ టార్గెట్లు కూడా అవలీలగా ఛేదించడం మొదలయ్యిందని చెప్పొచ్చు. క్రికెట్‌ చరిత్రలోనే ఇదొక గొప్ప మ్యాచ్‌గా మిగిలిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఎన్ని ఘనతలు సాధించినప్పటికీ వరల్డ్‌కప్‌ లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. దురదృష్టకరమైన జట్టుగా పేరు పొందిన సౌతాఫ్రికా ఇప్పటివరకు గెలిచిన ఏకైక ట్రోఫీ ఐసీసీ నాకౌట్‌ చాంపియన్స్‌ ట్రోఫీ మాత్రమే కావడం గమనార్హం.

చదవండి: ‘గేమ్‌ప్లాన్‌ ఎవడిదో కానీ చంపేయాలి’!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)