తిలక్‌ పోరాడినా... తప్పని ఓటమి

Published on Fri, 12/12/2025 - 01:21

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌ తర్వాతి పోరులో సునాయాసంగా తలవంచింది. పేలవ బౌలింగ్‌తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రaత్యర్థి భారీ స్కోరుకు కారణమైన జట్టు బ్యాటింగ్‌లోనూ తేలిపోయింది. బ్యాటింగ్‌లో డికాక్‌ మెరుపులతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్‌తో సఫారీలు పైచేయి సాధించారు. హైదరాబాదీ తిలక్‌ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.  

న్యూ చండీగఢ్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్‌ 1–1తో సమమైంది. గురువారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... చివర్లో డొనొవాన్‌ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. 

భారత్‌ ఏకంగా 22 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా, ఇందులో 16 వైడ్‌లు ఉన్నాయి. అనంతరం భారత్‌ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్‌ వర్మ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, బార్ట్‌మన్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.

సమష్టి ప్రదర్శన... 
ఓపెనర్‌ డికాక్‌ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టగా, హెన్‌డ్రిక్స్‌ (8) విఫలమయ్యాడు.అర్ష్ దీప్ ఓవర్లో 4, 6 కొట్టిన డికాక్‌ బుమ్రా ఓవర్లో మరో సిక్స్‌ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. మార్క్‌రమ్‌ (26 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నెమ్మదిగా ఆడగా,  జోరు కొనసాగిస్తూ డికాక్‌ 26 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్స్‌లతో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

వరుణ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్క్‌రమ్‌ అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు అర్ధ సెంచరీ తర్వాత డికాక్‌ తాను ఆడిన తర్వాతి 19 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీకి చేరువైన దశలో కీపర్‌ జితేశ్‌ చురుకుదనం కారణంగా డికాక్‌  దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. 

బ్రెవిస్‌ (14) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... ఫెరీరా, మిల్లర్‌ (12 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరును అందించింది. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు బాదాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తర్వాతి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది.  

ఓపెనర్లు విఫలం... 
శుబ్‌మన్‌ గిల్‌ (0) తాను ఆడిన తొలి బంతికే వెనుదిరగ్గా, 2 సిక్స్‌లు బాదిన అభిషేక్‌ శర్మ (17) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సూర్యకుమార్‌ (5) వైఫల్యాల బాట కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన అక్షర్‌ పటేల్‌ (21) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్, సిక్స్‌తో ఖాతా తెరిచిన తిలక్‌ ఆ తర్వాత కూడా నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్స్‌లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు. 

ఎన్‌గిడి బౌలింగ్‌లో మరో సిక్స్‌తో 27 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అయితే హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 20; 1 సిక్స్‌) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత తిలక్, జితేశ్‌ శర్మ (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి గెలిపించేందుకు పోరాడినా లాభం లేకపోయింది. 

14 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్‌ 9 బంతుల వ్యవధిలో 5 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. సఫారీలు ఒకే ఒక వైడ్‌ వేయడం విశేషం! 

స్కోరు వివరాలు 
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (రనౌట్‌) 90; హెన్‌డ్రిక్స్‌ (బి) వరుణ్‌ 8; మార్క్‌రమ్‌ (సి) అక్షర్‌ (బి) వరుణ్‌ 29; బ్రెవిస్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 14; ఫెరీరా (నాటౌట్‌) 30; మిల్లర్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–156, 4–160. బౌలింగ్‌:అర్ష్ దీప్  4–0–54–0, బుమ్రా 4–0–45–0, వరుణ్‌ 4–0–29–2, అక్షర్‌ 3–0–27–1, పాండ్యా 3–0–34–0, దూబే 2–0–18–0. 

భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 17; గిల్‌ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) ఎన్‌గిడి 0; అక్షర్‌ (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) బార్ట్‌మన్‌ 21; సూర్యకుమార్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 5; తిలక్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) ఎన్‌గిడి 62; పాండ్యా (సి) బ్రెవిస్‌ (బి) సిపామ్లా 20; జితేశ్‌ (సి) బార్ట్‌మన్‌ (బి) సిపామ్లా 27; దూబే (బి) బార్ట్‌మన్‌ 1;అర్ష్ దీప్  (సి) మిల్లర్‌ (బి) బార్ట్‌మన్‌ 4; వరుణ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) బార్ట్‌మన్‌ 0; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 162. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–32, 4–67, 5–118, 6–157, 7–158, 8–162, 9–162, 10–162. బౌలింగ్‌: ఎన్‌గిడి 3.1–0–26–2, యాన్సెన్‌ 4–0–25–2, సిపామ్లా 4–0–46–2, ఫెరీరా 1–0–14–0, బార్ట్‌మన్‌ 4–0–24–4, లిండే 3–0–23–0.

అర్ష్‌దీప్‌ 13 బంతుల ఓవర్‌! 
6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1...అర్ష్ దీప్  సింగ్‌ వేసిన ఒక ఓవర్లో 13 బంతుల వరుస ఇది! దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్‌ వేసినఅర్ష్ దీప్  ఏకంగా 7 వైడ్‌లు వేశాడు. తొలి బంతిని డికాక్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదగా... మిగతా 5 లీగల్‌ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)