Breaking News

WC 2023: మొన్న అలా.. ఇప్పుడిలా! మాట మార్చిన దాదా.. పాపం

Published on Fri, 08/25/2023 - 21:23

World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్‌కప్‌-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. 

ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్‌ టూ సేమ్‌ అనేలా తన టీమ్‌ను సెలక్ట్‌ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం.

అందుకే చహల్‌పై వేటు!
టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌కు ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్‌ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్‌ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు.

దీంతో అనుభవజ్ఞుడైన చహల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్‌తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.

తిలక్‌ వర్మకు నో ఛాన్స్‌
కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్‌ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్‌ తిలక్‌ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణను కూడా దాదా తప్పించాడు.

అయితే, మిడిలార్డర్‌ బ్యాటర్‌ గాయపడితే తిలక్‌ వర్మ, పేసర్‌ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్‌, స్పిన్నర్‌ గాయపడితే చహల్‌లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్‌లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా ప్రపంచకప్‌-2023 ఆరంభం కానుంది.

వన్డే వరల్డ్‌కప్‌-2023కి సౌరవ్‌ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

చదవండి: WC: కోహ్లి, బాబర్‌ కాదు.. ఈసారి అతడే టాప్‌ స్కోరర్‌: సౌతాఫ్రికా లెజెండ్‌
Asia Cup: షెడ్యూల్‌, జట్లు, ఆరంభ సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. వివరాలివే

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు