Breaking News

సౌరవ్‌ గంగూలీకు భారీ షాక్‌.. తొలి మ్యాచ్‌లోనే?

Published on Sun, 12/28/2025 - 07:57

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..  హెడ్ కోచ్‌గా తన ప్రయాణాన్ని ఓటమితో ఆరంభించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26 సీజన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా గంగూలీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో  ప్రిటోరియా క్యాపిటల్స్ పరాజయం పాలైంది.

మొదట బ్యాటింగ్ చేసిన జోబర్గ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్(2) విఫలమైనప్పటికి రైలీ రూసో (48), వియాన్ ముల్డర్ (43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

ప్రిటోరియా బౌలర్లలో టైమల్ మిల్స్, కోడి యూసుఫ్ తలా రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రిటోరియా జట్టుకు ఓపెనర్లు విల్ స్మీడ్ (34), బ్రైస్ పార్సన్స్ (41) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

ఒక దశలో 71/1తో పటిష్టంగా ఉన్నప్పటికీ.. ప్రిటోరియా వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ప్రిటోరియా లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ కింగ్స్ బౌలర్లలో డువాన్ జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్ గ్లీసన్ రెండు వికెట్లు సాధించాడు.

కాగా గంగూలీ ఓ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తుండడం ఇదే తొలిసారి. ప్రధాన కోచ్‌గా అరంగేట్రంలోనే ఓటమి ఎదురైంది. దాదా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లకు మెంటార్‌గా వ్యవహరించారు. ప్రిటోరియా క్యాపిటల్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ సిస్టర్‌ ఫ్రాంచైజీ కావడం గమనార్హం.
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)