Breaking News

ఆస్ట్రేలియాకు కొత్త కెప్టెన్‌

Published on Wed, 01/28/2026 - 17:54

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ ఎంపిక ఖరారైనట్లు తెలుస్తుంది. దిగ్గజ వికెట్‌కీపర్-బ్యాటర్ అలైస్సా హీలీ రిటైర్మెంట్ (ఫిబ్రవరి-మార్చిలో జరిగే భారత్‌ సిరీస్‌ తర్వాత) ప్రకటించడంతో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్‌ను కొత్త ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక​ చేసినట్లు సమాచారం. 

ఈ విషయమై అధికారిక​ ప్రకటన వెలువడనప్పటికీ.. మోలినెక్స్‌కు పట్టం కట్టడం దాదాపుగా ఖరారైనట్లు ఆసీస్‌ మీడియా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రేసులో లేని మోలినెక్స్‌ అనూహ్యంగా కెప్టెన్సీని దక్కించుకుందని కథనాలు వెలువడుతున్నాయి. 

అందులోనూ ఆమెను ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా ఎంపిక​ చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీలీ తర్వాత కెప్టెన్సీ రేసులో ఎల్లిస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్‌ పేర్లు ప్రధానంగా వినిపించినా, క్రికెట్‌ ఆస్ట్రేలియా మోలినెక్స్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.  

28 ఏళ్ల మోలినెక్స్‌ 2018లో భారత్‌తో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌తో ఆసీస్‌ తరఫున అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె 3 టెస్ట్‌లు, 17 వన్డేలు, 38 టీ20లు ఆడింది. లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా 76 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఆమె, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా చాలా ఉపయోగకరమైన ప్రదర్శనలు చేసింది.  

హీలీ నాయకత్వం వహించిన జట్టులో మోలినెక్స్‌ కీలక పాత్ర పోషించింది. 2018, 2020 టీ20 వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో భాగమైంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటింది. మోలినెక్స్‌ ఎంపిక ఆసీస్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతుల్యత తీసుకొస్తుంది.

 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)