Breaking News

సోఫీ డివైన్‌ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌

Published on Sun, 01/11/2026 - 21:29

డబ్ల్యూపీఎల్ 2026లో భాగంగా నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సోఫీ డివైన్ విధ్వంసం సృష్టించింది. 

తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెను ఆపడం ఢిల్లీ బౌలర్ల తరం కాలేదు. 6 ఓవర్ వేసిన స్నేహ రాణా బౌలింగ్‌లో అయితే సోఫీ 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఏకంగా 32 పరుగులు పిండుకుంది. ఓవరాల్‌గా  కేవలం 42 బంతులు మాత్రమే ఎదుర్కొన్న డివైన్‌..7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 పరుగులు చేశాడు. ఆమెతో పాటు కెప్టెన్‌ గార్డనర్‌ 49 పరుగులతో రాణించింది.

నందినీ శర్మ హ్యాట్రిక్‌..
ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పేసర్‌ నందిని శర్మ హ్యాట్రిక్‌ వికెట్లతో మెరిశాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన నందిని బౌలింగ్‌లో రెండో బంతికి కశ్వి గౌతమ్‌ పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తనుజా సింగిల్‌ తీసి స్ట్రైక్‌ కనిక అహుజకు ఇచ్చింది. 

అయితే నాలుగో బంతికి కనిక స్టంపౌట్‌ కాగా.. ఐదో బంతికి గైక్వాడ్‌, ఆరో బంతికి రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డయ్యారు. దీంతో తొలి హ్యాట్రిక్‌ నందిని ఖాతాలో చేరింది. ఓవరాల్‌గా నందిని తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఆమెతో పాటు శ్రీచరణి రెండు వికెట్లు సాధించింది.
చదవండి: T20 World Cup 2026: టీమిండియాకు భారీ షాక్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)