Breaking News

ధావన్‌పై మండిపడ్డ రోహిత్‌ శర్మ.. షాకింగ్‌ విషయం బయటపెట్టిన గబ్బర్‌

Published on Fri, 06/27/2025 - 13:18

టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan).. ‘ది వన్‌: క్రికెట్‌, మై లైఫ్‌ అండ్‌ మోర్‌’ పేరిట ఆటోబయోగ్రఫీ రాశాడు. తన వ్యక్తిగత జీవితంలోని విశేషాలను కూడా ఇందులో వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్‌ విషయాన్ని గబ్బర్‌ బయటపెట్టాడు.

భారత్‌-‘ఎ’ జట్టు 2006లో ఆస్ట్రేలియాలో పర్యటించగా.. నాటి ఆ టీమ్‌లో ధావన్‌తో పాటు టీమిండియా ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా ఉన్నాడు. ఇక ఈ టూర్‌లోనే ధావన్‌ ఓ బ్రిటిష్‌ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. తనను విడిచి ఉండలేని స్థితికి చేరుకున్న గబ్బర్‌ ఆమెను హోటల్‌ గదికి కూడా తీసుకువచ్చేవాడట.

ఆమె నా కోసమే పుట్టింది.. 
తన చర్య.. అప్పటికి రూమ్‌మేట్‌ రోహిత్‌ శర్మకు ఎంతో విసుగు తెప్పించిందని గబ్బర్‌ తన పుస్తకంలో రాశాడు. స్పోర్ట్స్‌స్టార్‌ కథనం ప్రకారం.. ‘‘ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు నేను అకస్మాత్తుగా ప్రేమలో పడిపోయాను. ‘ఆమె నా కోసమే పుట్టింది.. తననే నేను పెళ్లి చేసుకోబోతున్నాను’ అంటూ మైకంలో తేలిపోయాను.

అప్పటికి జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో నేను హాఫ్‌ సెంచరీ చేశాను. పర్యటన బాగానే జరుగుతోంది. ప్రతి మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆమెను కలిసేందుకు వెళ్లేవాడిని. తనను నా హోటల్‌ రూమ్‌కు తీసుకువచ్చేవాడిని.

నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?
అప్పుడు రోహిత్‌ శర్మ నాతో పాటు అదే గదిలో ఉండేవాడు. అయితే, తనకు ఇదంతా నచ్చేది కాదు. ‘నువ్వు అసలు నన్ను నిద్రపోనిస్తావా?’ అంటూ హిందీలో కంప్లైంట్‌ చేస్తూ ఉండేవాడు.

ఓరోజు సాయంత్రం నేను ఆమెతో కలిసి డిన్నర్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యా. అప్పటికే మా గురించి జట్టులో అందరికీ తెలిసిపోయింది. నేను ఆరోజు ఆమె చేయి పట్టుకుని హోటల్‌ లాబీ నుంచి వెళ్తుండగా.. జాతీయ జట్టులోని సెలక్టర్‌ ఒకరు మమ్మల్ని చూశారు.

తప్పు చేయలేదు
అయినా సరే నేను ఆమె చేతిని వీడలేదు. ఎందుకంటే.. నేను ఎటువంటి తప్పు చేయడం లేదని నాకు తెలుసు. ఆ పర్యటనలో బాగా రాణిస్తే జాతీయ జట్టులో చోటు దక్కుతుందని తెలుసు. కానీ రోజురోజుకూ నా ప్రదర్శన దిగజారిపోయింది’’ అని శిఖర్‌ ధావన్‌ చెప్పుకొచ్చాడు.

కాగా శిఖర్‌ ధావన్‌ రోహిత్‌ శర్మతో కలిసి చాలాకాలం టీమిండియా ఓపెనర్‌గా ఉన్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన గబ్బర్‌.. టెస్టుల్లో 2315, వన్డేల్లో 6793, టీ20 మ్యాచ్‌లలో 1759 పరుగులు సాధించాడు.

ఇక శిఖర్‌ ధావన్‌ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లాడిన.. అతడు కొన్నేళ్ల క్రితం ఆమెతో విడిపోయాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌ బ్యూటీ సోఫీ షైన్‌తో లిన్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆయేషా- ధావన్‌లకు కుమారుడు జొరావర్‌ ఉన్నాడు.

చదవండి: IND vs ENG 2nd Test: భార‌త జ‌ట్టులో కీల‌క మార్పులు.. అత‌డిపై వేటు! తెలుగోడికి చోటు?

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)